Siddarth : హీరోలు గానీ, హీరోయిన్స్ గానీ, దర్శకులు గానీ స్టార్ డం కోసం ఎన్నో ఏళ్ళు పడాల్సిన కష్టాలన్ని పడుతుంటారు. ఒక్కసారి స్టార్ డం వచ్చాక కొంతమంది ఎడా పెడా అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని వదలకుండా కమిటవుతుంటారు. ఇక స్టార్ డం రాగానే కొందరు రెట్టింపు ఉత్సాహంతో తనమీద ఉన్న మార్కెట్ తో కథ గురించి పట్టించుకోకుండా దర్శక, నిర్మాతలకి ఓకే చెప్పేస్తారు. ఫ్లోలో హిట్ అయిపోద్దిలే అని బ్లైండ్‌గా సినిమాలు చేసుకుంటూ వస్తారు. కానీ ఏ సినిమా హిట్ అవ్వాలన్నా ముందు కథే హీరో..అనే విషయాన్ని చాలామంద్ హీరోలు మర్చిపోతుంటారు. అదే మన సిద్దార్థ్ కూడా చేశాడు.

is siddarth fade out due to this...?
is siddarth fade out due to this…?

తమిళంలో శంకర్ దర్శకత్వంలో వచ్చిన బాయ్స్ అనే సినిమాతో సిద్దార్థ్ హీరోగా మారాడు. ఆ తర్వాత బాలీవుడ్‌లో రంగ్ దే బసంతి అనే సినిమా చేశాడు. ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత ఎం.ఎస్.రాజు చూసి ఆయన నిర్మించిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో హీరోగా ఎంచుకున్నాడు. ఈ సినిమా సిదార్థ్‌కి తెలుగులో డెబ్యూ సినిమా. అందరు సిద్దార్థ్‌ హీరోగా అంటే నిర్మాతని కామెంట్స్ చేశారట. అమ్మాయిలాగా ఉన్నాడు ఇతను హీరో ఏంటీ అని. సినిమా రిలీజయ్యాక బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిసింది. దాంతో కామెంట్స్ చేసిన వాళ్ళే కాంప్లిమెంట్స్ ఇచ్చారు.

Siddarth : సిద్దార్థ్ రెండు చోట్లా హీరోగా ఫేడవుట్ అయ్యాడు.

ఇక రెండవ సినిమాను దిల్ రాజు నిర్మాణంలో చేశాడు. అదే బొమ్మరిల్లు. జెనీలియా ఇందులో హీరోయిన్‌గా నటించగా భాస్కర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నలిచింది. అలాగే కొంచం ఇష్టం కొంచెం కష్టం..ఇలా వరుసగా తెలుగులో హిట్స్ అందుకున్న సిద్దార్థ్ క్రేజ్ విపరీతంగా పెరిగింది. అయితే ఆ తర్వాత వచ్చిన అనగనగా ఓ ధీరుడు, జబర్దస్త్, ఓ మై ఫ్రెండ్, ఓయ్.. లాంటి సినిమాలు చేసి తెలుగులో తన స్టార్ డం పోగొట్టుకున్నాడు. ఇక్కడ సిద్దార్థ్ చేసిన పెద్ద పొరపాటు కథల ఎంపిక. ఇదే పొరాటు అటు తమిళ సినిమాలలోనూ జరిగింది. దాంతో రెండు చోట్లా సిద్దార్థ్ హీరోగా ఫేడవుట్ అయ్యాడు. మళ్ళీ ఇప్పుడు సక్సెస్ కోసం గట్టిగా ట్రై చేస్తూ మహా సముద్రం సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో శర్వానంద్ మరో హీరోగా చేస్తున్నాడు. ఆర్ ఎక్స్ 100 ఫేం అజయ్ భూపతి దర్శకుడు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూలై 20, 2021 at 9:17 ఉద.