Sukumar : సుకుమార్..టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఓ గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆర్య సినిమాతో దర్శకుడిగా మారిన సుకుమార్ జగడం, ఆర్య 2, 100 % లవ్, 1 నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో, రంగస్థలం సినిమాలు తెరకెక్కించి స్టార్ డైరెక్టర్‌గా పాపులర్ అయ్యాడు. సుకుమార్ సినిమాలకి ఓ లెక్కుంటుంది. ప్రతీది చాలా కాలిక్యులేటెడ్‌గా చేస్తాడు. అందుకే ఈయనని లెక్కల మాస్టారు అని పిలుచుకుంటారు. స్టార్ హీరోలందరు ఆయన మేకింగ్ స్టైల్ కి మళ్ళీ మళ్ళీ సినిమా చేయాలని తాపత్రయపడుతుంటారు. రంగస్థలం తర్వాత సుకుమార్ రేంజ్ టాలీవుడ్‌లో అమాంతం పెరిగిపోయింది.

is sukumar not given chance by that star again

అయితే సూపర్ స్టార్ మహేష్ బాబుతో 1 నేనొక్కడినే తీశాడు సుకుమార్. థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజై ఫ్లాప్ గా మిగిలింది. ఈ సినిమా మీద అటు మహేష్ బాబు, ఇటు సుకుమార్ చాలా నమ్మకాలు పెట్టుకున్నారు. కానీ ఇద్దరినీ ఈ సినిమా దారుణంగా డిసప్పాయింట్ చేసింది. దాంతో సుకుమార్ ఎంతో కసిగా మళ్ళీ ఆయనతో సినిమా చేసి భారీ హిట్ ఇవ్వాలని అనుకున్నాడు. కానీ 1 నేనొక్కడినే ఫ్లాప్ అవడంతో మళ్ళీ మహేష్ సుక్కుకి ఛాన్స్ ఇవ్వడం లేదని ఇండస్ట్రీలో టాక్ ఉంది.

Sukumar : సుకుమార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో పుష్ప తెరకెక్కిస్తున్నాడు.

ముందు నుంచి మహేష్ హిట్ తీసే దర్శకుడికే ఛాన్స్ ఇస్తాడని ఓ మాట వినిపిస్తుంది. ఒక సందర్భంలో పూరి జగన్నాథ్ కూడా ఇదే మాట చెప్పుకొచ్చాడు. మహేష్ అవకాశాలు ఇచ్చిన దర్శకులను పరిశీలిస్తే అదే నిజమనిపిస్తుంది కూడా. చూడాలి మరి మహేష్ మళ్ళీ సుకుమార్‌కి ఛాన్స్ ఇస్తాడో లేదో. ప్రస్తుతం సుకుమార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో పుష్ప అనే పాన్ ఇండియన్ సినిమా తెరకెక్కిస్తున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను 5 భాషల్లో రెండు భాగాలుగా తీసుకు రానున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్యం శెట్టి మీడియా 200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 2, 2021 at 11:00 ఉద.