Tapsee: తాప్సీకి టాలీవుడ్‌లో సుడి లేదని మళ్ళీ ప్రూవ్ అయింది..ఇక అమ్మడు ఇక్కడ సర్దుకోవడమేనా..?

G K

Tapsee: తాప్సీకి టాలీవుడ్‌లో సుడి లేదని మళ్ళీ ప్రూవ్ అయింది..ఇక అమ్మడు ఇక్కడ సర్దుకోవడమేనా..? అంటే ఇప్పుడు తాను నటించిన సినిమా చూసిన అందరూ అదే అభిప్రాయపడుతున్నారు. ఝుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చిన తాప్సీ పన్ను, మొదటి సినిమాతో బాగానే ఆకట్టుకుంది. కానీ, ఆ తర్వాత చేసిన సినిమాలలో ప్రభాస్ హీరోగా నటించిన ఒక్క మిస్టర్ పర్‌ఫెక్ట్  సినిమా తప్ప మిగతావన్నీ వరుసగా ఫ్లాప్స్ అందుకుంది. చెప్పాలంటే తాప్సీకి తెలుగులో లక్కీగా తెలుగులో పెద్ద హీరోలు, దర్శకులతో చేసే అవకాశాలే వచ్చాయి.

హిట్స్ మాత్రం దక్కలేదు. దాంతో ఇక్కడ తాప్సీకి అవకాశాలు తగ్గిపోయాయి. అయితే అదే సమయంలో బాలీవుడ్ అవకాశాలు దక్కడం అక్కడ, గ్లామర్ రోల్స్‌తో పాటు కథా ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేసే అవకాశాలు అందుకుంది. జుడ్వా 2 లాంటి సినిమాలలో బికినీ ట్రీట్ ఇచ్చిన తాప్సీ బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ లాంటి వారితో కలిసి పింక్, బద్లా లాంటి సినిమాలలో నటించే అవకాశాలు అందుకుంది. అంతేకాదు, బాలీవుడ్‌లో తాప్సీకి లక్ బాగా కలిసొచ్చింది.

is tapsee-missed the chance to get hit in tollywood once again
is tapsee-missed the chance to get hit in tollywood once again

Tapsee: తాప్సీ టాలీవుడ్ నుంచి సర్దుకోవడమే..!

అక్కడ చేసిన సినిమాలతో స్టార్ హీరోయిన్స్ సరసన చేరింది. మంచి రెమ్యునరే షన్ అందుకుంటూ క్రేజీ ప్రాజెక్ట్ చేస్తూ క్రేజీ హీరోయున్‌గా నిర్మాతగా మారింది. అయితే చాలా లాంగ్ గ్యాప్ తర్వాత తాప్సీకి తెలుగులో మిషన్ ఇంపాజిబుల్ సినిమా చేసే అవకాశం అందుకుంది. ఈ సినిమాకు దర్శకుడు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేమ్. ఆ సినిమాతో దర్శకుడు స్వరూప్ రాజ్ మంచి సక్సెస్ అందుకోవడంతో పాటుగా నవీన్ పొలిశెట్టికి మంచి క్రేజ్ తెచ్చిపెట్టాడు. దాంతో తాప్సీ తాజాగా నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చిన మిషన్ ఇంపాజిబుల్ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. చిరు కూడా సినిమాకు మంచి హైప్ క్రియేట్ చేశారు. కానీ, సినిమా రిలీజైయ్యాక ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దాంతో ఇక పూర్తిగా తాప్సీ టాలీవుడ్ నుంచి సర్దుకోవడమే అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

- Advertisement -