CBN: ఎమ్మెల్సీ ఎన్నికలు ఏపీలో రాజకీయాల ముఖ చిత్రం మారింది. ఇప్పుడు టీడీపీ నేతల్లో ఎప్పుడూ లేని సంతోషం కనిపిస్తుంది కానీ వైసీపీలో మాత్రం ఎక్కడ లేని భయం కనిపిస్తుంది. మొన్నటి వరకు వై నాట్ 175 అన్న వైసీపీ నేతల్లో ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో గెలుస్తామా అన్న భయం స్పష్టంగా కనిపిస్తుంది. మొన్నటి వరకు వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతో ఉన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు వచ్చే ఎన్నికలో గెలిచినా తరువాత ప్రమాణ స్వీకారం చెయ్యడానికి సిద్ధమవుతున్నట్టు కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు నెల్లూరులో ఎప్పటి నుండో పట్టు సాధించడానికి ఎప్పటి నుండో ప్రయత్నిస్తున్నారు కానీ అక్కడ పట్టు సాధించడానికి బాబుకు అక్కడ బలమైన నాయకులు దొరకడం లేదు కానీ ఇప్పుడు ముగ్గురు నాయకులు బాబుకు దొరకడం వల్ల అక్కడ వచ్చే ఎన్నికలో పాగా వెయ్యడానికి టీడీపీ నాయకులు సిద్ధమవుతున్నారు.

ముగ్గురు వైసీపీ నేతలే బాబుకు బలం
నెల్లూరు జిల్లాలో మొత్తం 10 నియోజక వర్గాలు ఉన్నాయ్. ప్రస్తుతం ఇక్కడ టీడీపీకి కనీసం ఒక్క సీట్ కూడా లేదు. 2014 ఎన్నికల్లో మూడు స్థానాల్లో గెలిచిన టీడీపీ, 2019 ఎన్నికల్లో మాత్రం కనీసం ఒక్క సీట్ కూడా గెలవలేదు. మొన్నటి వరకు ఇక్కడ కేవలం సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి , నారాయణ మాత్రమే టీడీపీకి బలమైన నాయకులుగా ఉండేవారు కానీ ఇప్పుడు వైసీపీ నుండి ముగ్గురు నేతలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా ఓటు వెయ్యడంతో ఇప్పుడు వాళ్ళ మద్దతు కూడా వచ్చే ఎన్నికల్లో టీడీపీకి బలం చేకూరనుందని, దాంతో అక్కడ మరింత బలం పెరిగి, వచ్చే ఎన్నికల్లో నెల్లూరు జిల్లాల్లోని 10స్థానాల్లో కనీసం ఒక ఐదన్న గెలిచే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
వైసీపీ వ్యూహమేంటి!
ఇప్పుడు వైసీపీలోని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం నారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా ఓటు వేశారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఈ నాయకులకే టీడీపీ సీట్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి టీడీపీ బలం ఖచ్చితంగా నెల్లూరు సిటీ, రురల్, కావలి, ఉదయగిరి, వేంకటగిరి నియోజకవర్గాల్లో తమ పార్టీ గెలుపు సాదిస్తుందని టీడీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు 2019ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో గెలుపు సాధించిన వైసీపీ, ఇప్పుడు కీలక నేతలు టీడీపీకి వెళ్లడంతో వచ్చే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాన్ని టీడీపీ అనుసరిస్తుందో వేచి చూడాలి.