Shakuntalam : శాకుంతలం.. సమంత అక్కినేని మొదటిసారి నటిస్తున్న పౌరాణిక చిత్రం. ఇలాంటి సినిమా సమంత చేస్తుందని ఇండస్ట్రీ వర్గాలు గాని, అభిమానులు గానీ ఊహించలేదు. పెళ్ళికి ముందు వరకు సమంత చేసినవన్ని కమర్షియల్ సినిమాలే. అందులో గ్లామర్ రోల్స్ చేసిన సినిమాలు ఉన్నాయి. భారీ హిట్స్ దక్కడంతో సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగింది. అయితే పెళ్ళి తర్వాత సమంత ఆలోచనా ధోరణి పూర్తిగా మారిపోయింది. కథా బలమున్న సినిమాలనే ఎంచుకుంటోంది. గ్లామర్ పాత్రలకి స్వస్తి చెప్పి తన కెరీర్‌కి మరింత ఉపయోగపడే సినిమాలనే ఎంచుకుంటోంది.

is that movie the reason for missing the chance in shakuntalam
is that movie the reason for missing the chance in shakuntalam

ఈ క్రమంలోనే శాకుంతలం కమిటయింది. దర్శకుడు గుణశేఖర్ కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలంను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. ఇందులో సమంత టైటిల్ పాత్ర శకుంతలగా.. మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడిగా నటిస్తున్నారు. ఇటీవలే ‘ది ఫ్యామిలీ మెన్ 2’ వెబ్ సిరీస్ తో వచ్చి ఆకట్టుకుంది. ఇందులో ఆమె పోషించిన రాజీ పాత్రకి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇక శాకుంతలం అనే పాన్ ఇండియన్ సినిమా సమంత రేంజ్ మరింతగా పెంచుతుందని అందరూ చెప్పుకుంటున్నారు. పాన్ ఇండియన్ సినిమా కావడంతో సమంత చాలా కష్టపడుతుందని ..తన సపోర్ట్ వల్లే ఈ సినిమా షూటింగ్ చాలా స్పీడ్‌గా చిత్రీకరణ జరుపుతున్నట్టు దర్శకుడు గుణశేఖర్ తెలిపాడు.

Shakuntalam : శాకుంతలం కూడా మిస్ అయిందని చెప్పుకుంటున్నారు.

అయితే గుణశేఖర్ ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయగానే అందరూ అనుకుంది..శకుంతలగా అనుష్క శెట్టి నటిస్తుందని వార్తలు వచ్చాయి. అంతక ముందు గుణశేఖర్ తెరకెక్కించిన ‘రుద్రమదేవి’
సినిమాలో అనుష్క నటించిన సంగతి తెలిసిందే. మరోసారి శాకుంతలంతో ఈ కాంబినేషన్ రిపీటవుతుందని భావించారు. కానీ సైజ్ జీరో సినిమా తర్వాత అనుష్కలో వచ్చిన శారీరక మార్పు వల్ల ఈ ప్రాజెక్ట్ చేజారిపోయిందని చెప్పుకున్నారు. సైజ్ జీరో కోసం చాలా కష్టపడింది. తనని తాను పూర్తిగా మార్చేసుకుంది. సినిమా కోసం అంత కష్టపడినప్పటికి సక్సెస్ దక్కకపోగా చాలా సినిమాలను తన నుంచి లాగేసింది. అలా శాకుంతలం కూడా మిస్ అయిందని చెప్పుకుంటున్నా

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూలై 7, 2021 at 12:00 సా.