Gajala : టాలీవుడ్ లో గజాలకి మంచి పేరుంది. సీనియర్ స్టార్ హీరో జగపతిబాబు నటించిన నాలో ఉన్న ప్రేమ అనే సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయం అయింది. అదే సమయంలో రాజమౌళి దర్శకుడుగా ఎంట్రీ ఇస్తూ తెరకెక్కించిన సినిమా స్టూడెంట్ నంబర్ 1. నిన్ను చూడాలి సినిమాతో హీరోగా మారిన నందమూరి హీరో జూనియర్ ఎన్.టి.ఆర్ ఇందులో హీరోగా నటించాడు. ఆయనకి జంటగా గజాలను తీసుకున్నారు. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో గజాలకి తెలుగులో వరుసగా ఆఫర్స్ వచ్చాయి. ఎక్కువగా యూత్ హీరోలతోనే నటించింది. డెబ్యూ సినిమా తర్వాత ఉదయ్ కిరణ్ తో కలుసుకోవాలని, ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన తొట్టిగ్యాంగ్, జూనియర్ ఎన్.టి.ఆర్ నటించిన అల్లరి రాముడు లాంటి సినిమాలు చేసింది.

is that star hero reason for gajala sucide....?
is that star hero reason for gajala sucide….?

తను నటిస్తున్న సినిమాలు హిట్ కావడంతో తెలుగుతో పాటు తమిళ సినిమాలు చేసే అవకాశం దక్కించుకుంది. కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే ఎందుకో ఈమె ఆత్మహత్యాయత్నం చేసింది. జులై 22, 2002 హైదరాబాదులోని బంజారా హిల్స్ లోని ప్రశాంత్ కుటీర్ గెస్ట్ హౌజ్ లో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. అర్జున్ కి కాల్ చేసి సర్ జీ ఇంక నేను మీకు కనిపించను అని ధీనంగా చెప్పింది. దాంతో సుల్తానా, అర్జున్ వచ్చి నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. దాంతో ప్రాణాలతో బయటపడింది. దీని గురించి అప్పట్లో వార్తలు తెగ వైరల్ అయ్యాయి. అయితే గజాలా ఇలా ఆత్మహత్యాయత్నానికి ఎందుకు ప్రయత్నించింది అన్న వాటికి మాత్రం కారణాలు బయటకు రాలేదు. అయితే ఆ సమయంలో గజాలాను ఆసుపత్రికి తీసుకు వచ్చిన అజ్రున్ కారణంగానే ఆమె సూసైడ్ కి కారణం అని రూమర్స్ వచ్చాయి. వీటికి అర్జున్ స్పందించి క్లారిటీ ఇచ్చాక సద్దుమణిగాయి.

Gajala : మొత్తంగా సినిమాలకి దూరమయింది.

ఆ తర్వాత టాలీవుడ్ తో పాటు కోలివుడ్ లోనూ అవకాశాలు దక్కకపోవడంతో కొన్నాళ్ళు ఎదురు చూసి మొత్తంగా సినిమాలకి దూరమయింది. ఆ తర్వాత కొంతకాలం గజాలా మస్కట్ లో ఉన్న తండ్రి వ్యాపారంలో ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేసింది. 2016 ఫిబ్రవరి 24 న హిందీ టీవీ నటుడు ఫైజల్ రజాఖాన్ ను వివాహం చేసుకొని సెటిలయింది. మరి చాలామంది హీరోయిన్స్ సెకండ్ ఇన్నింగ్స్ కోసం ఎదురు చూస్తూ అవకాశం వస్తే మళ్ళీ బ్యాక్ టు మూవీ ఇండస్ట్రీ అంటున్నారు. ఈ క్రమంలో గజాలా కూడా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టే ఆలోచన ఉందా లేదా చూడా అనేది వేచి చూడాలి.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూలై 4, 2021 at 10:30 ఉద.