Vishwak Sen: విశ్వక్ సేన్ దెబ్బకు కదులుతున్న టాలీవుడ్ ఇండస్ట్రీ..ఒక్కొక్కరుగా దిగిపోతున్నారు..

G K

Vishwak Sen: టాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే హీరోగా నిలదొక్కుకుంటున్నాడు విశ్వక్ సేన్. ఫలక్‌నుమా దాస్, పాగల్ లాంటి సినిమాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు విశ్వక్ సేన్. మరికొన్ని గంటల్లో ఆయన హీరోగా నటించిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే, ఇటీవలే ప్రమోషన్స్ కొత్తగా ప్లాన్ చేసిన విశ్వక్ సేన్ ఓ ఫ్రాంక్ వీడియోతో తన సినిమాపై క్రేజ్ తీసుకురావాలనుకున్నాడు. అదే ఇప్పుడు ఇన్ని సమస్యలను సృష్ఠిస్తుందని మాత్రం ఊహించలేదు.

ఆ ఫ్రాంక్ వీడియోను పట్టుకొని ప్రముఖ టీవీ ఛానల్ విశ్వక్ సేన్‌ను స్టూడియోకు పిలిచి కొన్ని పదాలతో నొచ్చుకునేలా చేసింది. అది విశ్వక్ సేన్ భరించలేకపోయాడు. తిరిగి యాంకర్‌ను ప్రశ్నించినందుకు ఆమె తన స్టూడియో నుంచి వెళ్ళిపొమ్మన్న పదాన్ని చాలా రఫ్‌గా ఇంగ్లీషులో గెట్ అవుట్ అంటూ కేకలు వేసింది. అప్పుడు సహనం కోల్పోయి అనకూడని పదాన్ని అనేశాడు విశ్వక్ సేన్. అక్కడి నుంచి దీనిపై సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ అందరూ చూస్తూనే ఉన్నారు. అయితే, ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం నెమ్మదిగా కదులుతోంది. ఒక్కక్కరూ సోషల్ మీడియా ద్వారా విశ్వక్ సేన్‌కే సపోర్ట్ చేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు.

is tollywood industry supporting vishwak-sen
is tollywood industry supporting vishwak-sen

Vishwak Sen: హరీశ్ శంకర్ కూడా హీరో విశ్వక్ సేన్ వైపే..

అర్జున్ రెడ్డి సినిమాతో బాగా పాపులారిటీ తెచ్చుకున్న రాహుల్ రామకృష్ణ తనదైన శైలిలో స్పందిస్తూనే ఛానల్‌కు సవాల్ విసిరాడు. ఈ మేరకు వరుసగా ట్వీట్స్ పెట్టాడు. విశ్వక్ సేన్‌ను సపోర్ట్ చేస్తూ రామకృష్ణ చేసిన ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇదే వరుసలో ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ కూడా హీరో విశ్వక్ సేన్ వైపే నిలుచున్నాడు. అలాగే, కరాటే కళ్యాణి సహా మెగా హీరో కూడా విశ్వక్‌కు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు వివాదం ముదరడం ప్రారంభమయింది. మరి రానున్న రోజుల్లో ఇంకెంతమంది విశ్వక్‌కు సపోర్ట్ చేస్తూ నిలుస్తారో ఎంత దూరం ఈ గొడవ కొనసాగుతుందో చూడాలి.

- Advertisement -