TRS:తెరాసాకు ప్రతిపక్షాల భయం పట్టుకుందా!!

Arjun

TRS:రాజకీయాల్లో పరిస్థితులు ఎప్పుడైనా మారిపోవచ్చు. ఎప్పుడూ ధైర్యంగా, ఆత్మ విశ్వాసంతో కనిపించే తెరాసా నాయకులకు ఇప్పుడు ప్రతిపక్షాల నాయకులు భయం పట్టుకున్నట్టు ఉంది. ప్రతిపక్షాల నాయకులు

Is trs afraid about growing popularity of opposition parties

తుమ్మడానికి కూడా పర్మిషన్ తీసుకోవాలన్నట్టు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. తాజాగా కేటీఆర్ లాంటి నాయకులు కూడా తమ రాజకీయ నూన్యతా భావాలను బయటపెట్టుకుంటున్నారు.

పాల్ కు కూడా భయపడుతున్నారా!!

తాజాగా రైతులను పరామర్శించడానికి వెళ్తున్న కేఏ పాల్ పై ఒక తెరాసా కార్యకర్త దాడి చేశారు. ఆ దాడి చేసిన వ్యక్తిపై ఇప్పటి వరకు తీసుకోలేదు. అలాగే మరోసారి వెళ్ళడానికి పాల్ ప్రయత్నించగా, పాల్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రెండుసార్లు అధికారం చేజిక్కించుకున్న తెరాసా నాయకులు పాల్ లాంటి ఎలాంటి ప్రజాధారణ లేని వ్యక్తికి కూడా భయపడుతున్నారు.

ట్విట్టర్ గొడవ

కేటీఆర్ ట్విట్టర్ లో ఆక్టివ్ గా ఉంటూ, అప్పుడప్పుడు ప్రజలతో ట్విట్టర్ వైదికగా ప్రజలతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. ట్విట్టర్ లో కేటీఆర్ ఆక్టివ్ గా ఉండటాన్ని చూసి, ఆయన్ను ప్రతిపక్షాల నాయకులు ట్విట్టర్ నాయకుడు అని ఉంటారు. అయితే కేటీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ యొక్క ఆఫిసిఅల్ ట్విట్టర్ అకౌంట్ ను బ్లాక్ చేశారు. కాంగ్రెస్ ఇప్పుడు అంత బలంగా లేదు, అయినా కేటీఆర్ లాంటి నాయకులు కూడా భయపడుతున్నారు. కేటీఆర్ దాదాపు బీజేపీకి, కాంగ్రెస్ కు, ప్రవీణ్ కుమార్ కు, పాల్ కు కూడా భయపడుతున్నారు. అధికారంలో ఉన్న నాయకులకు ఇంతటి నూన్యతా భావలను ఎప్పుడూ, ఎవ్వరిలో చూడలేదు.

- Advertisement -