Nithya menon : నిత్యా మీనన్ సౌత్‌లో ఉన్న టాలెంటెడ్ హీరోయిన్స్‌లో ఒకరు. తనకి కాస్త హైట్ మైనస్ అనే కామెంట్స్ వినిపిస్తున్న మాట వాస్తవం అయినప్పటికే తన కోసం వెతుక్కుంటూ వచ్చే పాత్రలు రాక మానవు. అలా మొదలైంది సినిమాతో తెలుగులో పాపులారిటీ తెచ్చుకున్న నిత్యా మీనన్ నితిన్ కి మంచి పెయిర్ అని ఇండస్ట్రీలో అలాగే ప్రేక్షకుల్లో చాలామందికి అభిప్రాయం. ఇష్క్, గుండెజారి గల్లంతైయ్యిందే సినిమాలలో వీరి కాంబోకి మంచి క్రేజ్ వచ్చింది.

it is difficult for nithya-menon-
it is difficult for nithya-menon-

తమిళ, మలయాళ సినిమాలలో కూడా నిత్యా చేసే సినిమాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. బాలీవుడ్‌లో మిషన్ మంగళ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ తర్వాత అభిషేక్ బచ్చన్ నటించిన వెబ్ సిరీస్‌లో నటించి హాట్ టాపిక్ అయింది. బోల్డ్ గా నటించడమే కాదు లెస్బియన్ పాత్రలో కనిపించి షాకిచ్చింది. అయితే ఇలా కనిపించడం నిత్యాకి ఇదే తొలిసారి. గతంలో ఎప్పుడు ఇలాంటి బోల్డ్ పాత్రలు తెలుగు సినిమాలలో పోషించలేదు.

Nithya menon : నిత్యా మీనన్ హాట్ అండ్ గ్లామర్ రోల్స్..స్కిన్ షోస్ చేయాలని..?

ఇక నిత్యా మీనన్ హాట్ అండ్ గ్లామర్ రోల్స్..స్కిన్ షోస్ చేయాలని ఏ దర్శక, నిర్మాతలు అడిగినా నిర్మొహమాటంగా నో చెప్పేస్తుంది. కథ మొత్తం తనకి నచ్చాలి.. అందులో పాత్ర నిత్యకి బాగా పేరొచ్చేదిగా ఉండాలి. అలా కాకుండా రెమ్యునరేషన్ భారీగా ఇస్తామంటే అవసరం లేదంటోంది. ఇలాంటి పాత్రలల్లో నటింపజేయడం చాలా కష్టం. ఇలా నిత్యా చాలా సినిమాలు వదులుకుంది కూడా. లేదంటే నిత్యాకి ఉన్న టాలెంట్‌కి ఎపుడో నంబర్ వన్ ప్లేస్ చేరుకునేది. కానీ అదే పెద్ద మైనస్ అయింది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on మే 26, 2021 at 4:00 సా.