Rohini: బుల్లితెర సీరియల్స్ ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో రోహిణి ఒకరు. ఈమె పలు బుల్లి తెర సీరియల్స్ లో నటించిన అనంతరం బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లారు. ఇలా బిగ్ బాస్ ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రోహిణి ప్రస్తుతం బుల్లితెర పై ప్రసారమవుతున్నటువంటి సందడి చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. జబర్దస్త్ కార్యక్రమంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కూడా సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే గతంలో ఓ కార్యక్రమంలో భాగంగా ఈమె తనకు బ్రేకప్ జరిగింది అంటూ తన లవ్ స్టోరీ గురించి తెలియజేశారు.
ఇలా ఒకసారి బ్రేకప్ అయిన తర్వాత కొంతకాలం పాటు సింగిల్గానే ఉన్నటువంటి రోహిణి తిరిగి మరోసారి ప్రేమలో పడ్డారంటూ తాజాగా ఓ వార్త వైరల్ గా మారింది. ఇకపోతే ఈమె ప్రతి ఆదివారం శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో సందడి చేస్తున్నారనే సంగతి మనకు తెలిసిందే. తాజాగా ఈ ఆదివారం ప్రసారం కాబోయే కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా ఎప్పటిలాగే సెలబ్రిటీలందరూ కూడా తమదైన శైలిలో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశారు.
ప్రియుడిని పరిచయం చేయబోతున్న రోహిణి..
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా జబర్దస్త్ రోహిణి మాట్లాడుతూ నన్ను అంటూ సీరియస్గా తీసుకునే వారు ఉన్నారు కనుక వారి కోసం ఈ పాట పాడుతున్నాను అంటూ ఈమె ఏమయిందో ఏమో నా మదిలో ఈ వేళ అనే పాటను పాడారు. ఇలా రోహిణి పాట పాడుతున్న సమయంలో వెనుక నుంచి ఓ వ్యక్తి స్టేజ్ పైకి వచ్చినట్టు చూపించారు. అయితే ఆ వ్యక్తి ఎవరు అనే విషయం తెలియకుండానే ప్రోమో కట్ చేశారు. ఇలా ఆ వ్యక్తి ఫేస్ కనిపించకపోవడంతో బహుశా ఈమె తన లవర్ ని ఇన్వైట్ చేశారని ఈ కార్యక్రమం ద్వారా తన లవర్ ను పరిచయం చేయబోతున్నారు అంటూ నేటిజన్స్ భావిస్తున్నారు. మరి రోహిణి ఎవరిని లవ్ చేస్తున్నారన్న సందేహాలను కూడా వ్యక్తపరుస్తున్నారు ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో వైరల్ గా మారింది.