Pawan Kalyan: నిన్న జరిగిన జనసేన ఆవిర్భావ సభలో జనసేన అధినేత చాల కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడించడానికి తానూ ఎంతవరకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాననే అంశాన్ని, వచ్చే ఎన్నికల్లో జనసేన అనుసరించే వ్యూహాల గురించి ఈ సభలో చాలా క్లారిటీతో పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. అలాగే గత ఎన్నికల్లో తానూచేసిన తప్పులను కూడా చెప్తూ, వాటిని మళ్ళీ రిపీట్ కానివ్వనని కూడా చెప్పాడు. అయితే ఈ సభలో పవన్ కల్యాణ తనపై వస్తున్న చాలా ఆరోపణనల గురించి, ప్రజల్లో తనపై ఉన్న అనుమానాలకు ఆన్సర్ ఇస్తూ వచ్చాడు. అలాగే వచ్చే ఎన్నికల్లో ఎవరితో, ఎందుకు పొత్తు పెట్టుకునే పరిస్థితులు వచ్చాయో, వస్తున్నాయో కూడా చెప్పాడు. అయితే గతంలోలా జనసేన గుడ్డిగా ముందుకెళ్లదన్న విషయాన్నీ కూడా పవన్ కళ్యాణ్ చాల గట్టిగా చెప్పాడు. తనను గెలిపించాలని, తనను లీడర్ గా గుర్తించని జనాలపై ఆగ్రహాన్ని కూడా చూపించాడు.
జనసేనను బలికానివ్వను
వచ్చే ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్ళాలన్న అంశంపై పవన్ కళ్యాణ్ పూర్తి క్లారిటీతో ఉన్నాడు. ఎందుకంటే గతంలో జనసేనకు వచ్చిన ఫలితాన్ని పవన్ అప్పుడే మర్చిపొయ్యేలా లేడు. గత అనుభవాలను గుర్తు పెట్టుకొని, వచ్చే ఎన్నికలో ఎట్టి పరిస్థితుల్లో గెలవడానికి పవన్ కళ్యాణ్ వ్యూహాలు రచిస్తున్నారు. వచ్చే జనసేనను మళ్ళీ బలిపశువును కానివ్వమని పవన్ కళ్యాణ్ చెప్పాడు. తనతోపాటు జనసేన అభ్యర్థులను కూడా గెలిపించి, అసెంబ్లీకి వెళ్తామని చాల ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించి, ఒకే కులం చేతిలో ఉన్న అధికారాన్ని ప్రజలందరికి పంచుతానని పవన్ చెప్పాడు.
పొత్తు కంఫర్మ్
వచ్చే ఎన్నికల్లో జనసేన-టీడీపీ పొత్తు ఖాయమని పవన్ కళ్యాణ్ చెప్పకనే చెప్పేశాడు. వచ్చే ఎన్నికల్లో అయితే కానీ తనకు టీడీపీతో పొత్తు పెట్టుకోవాలనే ఉద్దేశం లేదని, కానీ పరిస్థితుల ప్రభావం వల్ల టీడీపీతో పొత్తు పెట్టుకునే పరిస్థితి వచ్చిందని ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు. అసలు తానూ అనుకున్న ప్రకారం బీజేపీ పెద్దలు స్పందించి ఉంటే, ఈరోజుకు రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొత్తం తమకే వచ్చేదని, టీడీపీతో అసలు పొత్తు పెట్టుకునే పరిస్థితి వచ్చేది కాదని తెలిపాడు. అలాగే వచ్చే రోజుల్లో ముస్లిమ్స్ పై బీజేపీ వ్యక్తులు ఎలాంటి దాడులకు పాల్పడినా, వాళ్ళతో కూడా పొత్తు వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.