Janhvi Kapoor: చిలుకపచ్చ చీరలో చితక్కొట్టిన జాన్వీ కపూర్..లేటెస్ట్ పిక్స్ వైరల్..

G K

Janhvi Kapoor: ఎప్పుడూ లేనిది వింతగా జాన్వీ కపూర్ చక్కగా చీర కట్టి మురిపించింది. ఈ మధ్య కాలంలో ఈ యంగ్ బ్యూటీ చిట్టి పొట్టి డ్రసుల్లో కనిపించి కవ్వించిన అతిలోక సుందరి గారాల కూతురు నెటిజన్స్‌కు మాత్రమే కాదు ఏజ్ బార్ అయిన వాళ్ళకు చమటలు పెట్టించింది. బికినీ ట్రీట్..ఎద అందాలతో .. నడుమందాల తో మతులు పోగొట్టింది. బీచ్‌లలో రక రకాల ఫొటో షూట్స్ చేసి వాటిని తీసుకొచ్చి నెట్టింట పెడుతూ వేడెక్కించింది. బాలీవుడ్ స్టార్ కపుల్ డాటర్ కాబట్టి ఆ మాత్రం ఉండాల్సిందే అని కామెంట్స్ వినిపించాయి.

వాస్తవంగా జాన్వీ కపూర్‌కు సినిమాలలో అవకాశాలు పెద్దగా దక్కడం లేదు. హిందీ సీమలో జాన్వీ తండ్రి బోనీకపూర్ పెద్ద నిర్మాత. ఆయన ఈ మధ్య కాలంలో సౌత్ సినిమాలను నిర్మిస్తున్నారు. ముఖ్యంగా తమిళంలో అజిత్, హెచ్ వినోద్ కాంబినేషన్‌ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు కూతుళ్ళు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌లను సౌత్ ఇండస్ట్రీలలో హీరోయిన్స్‌గా పరిచయం చేయాలని ట్రై చేస్తున్నారు. ఇదుగో అదుగో అంటూ వార్తలు వస్తున్నాయి తప్ప అవి నిజం కావడం లేదు.

janhvi-kapoor-green saree pics are going viral
janhvi-kapoor-green saree pics are going viral

Janhvi Kapoor: క్యూట్, సూపర్ జాన్వీ అంటూ కామెంట్స్..

అయినా జాన్వీ ఏమాత్రం డిసప్పాయింట్ అవడం లేదు. తన వెనకాల బోనీకపూర్, కరణ్ జొహార్ లాంటి అగ్ర నిర్మాతలు ఉన్నారని చాలా ధీమాగా ఉంది. అందుకే, ఎక్కువ గా జాన్వీ ఫొటో షూట్స్ మీద ఫోకస్ పెట్టి క్రేజ్ పెంచుకుంటోంది. ఇక తాజాగా జాన్వీ కపూర్ చిలుక పచ్చ చీర కట్టి ఫొటో షూట్ నిర్వహించి ఆ ఫొటోలను సోషల్ మీడియా లో షేర్ చేసింది. చెప్పాలంటే ఎప్పుడూ చిన్న చిన్న డ్రసులు వేసుకొని ఒళ్ళు చూపించే జాన్వీ ఇలా పద్ధతిగా చీరకట్టి చితకొట్టేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. అందుకే, క్యూట్, సూపర్ జాన్వీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా జాన్వీ లేటెస్ట్ పిక్స్ మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి.

- Advertisement -