Jathirathnalu : జాతిరత్నాలు సినిమా ఎంతటి సక్సస్ సాధించిందో అందరికీ తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చి కరోనా సమయంలో కూడా ఇండియాతో పాటు విదేశాలలో కూడా ఊహించని విధంగా వసూళ్ళు రాబట్టింది. ఇక ఈ సినిమాతో దర్శకుడికి మంచి క్రేజ్ వచ్చింది. నిర్మాతగా వ్యవహరించిన దర్శకుడు నాగ్ అశ్విన్ మంచి సక్సస్ అందుకున్నాడు. ఈ సినిమాలో నటించిన నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రవీంద్రన్ లకి మంచి క్రేజ్ వచ్చేసింది. ముఖ్యంగా నవీన్ పొలిశెట్టి హీరోగా సెటిలయ్యాడు. ప్రస్తుతం రెండు పెద్ద నిర్మాణ సంస్థలలో నటించే అవకాశం అందుకున్నాడు.

jathirathnalu-heroine-is-earning-without-movies

ఇక ఇదే సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయమయింది. ఫరియా అబ్ధుల్లా. మిగతా వాళ్ళకి ఎంతటి క్రేజ్ వచ్చిందో అంతే క్రేజ్ హీరోయిన్‌గా నటించిన ఫరియాకి వచ్చింది. అంతేకాదు ఈ క్రేజ్ తో మాస్ మహారాజ రవితేజ నటించబోతున్న సినిమాలో అవకాశం అందుకుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే సినిమాలకంటే ప్రస్తుతం షాప్ ఓపెనింగ్స్ తో ఈ యంగ్ బ్యూటీ బాగా సంపాదిస్తుందట. ఒక్కో షాప్ ఓపెనింగ్ కి దాదాపు 15 లక్షల వరకు పుచ్చుకుంటుందని తెలుస్తోంది. మొత్తానికి హైదరాబాద్ అమ్మాయి ఒక్క సినిమాతో ఇంత క్రేజీ స్టార్ గా మారడం గొప్ప విషయం అని చెప్పుకుంటున్నారు.

Jathirathnalu : ‘జాతిరత్నాలు’ సినిమాలో అవకాశం అందుకుంది.

ఇక ఫరియా అబ్ధుల్లా దాదాపు ఏడేళ్లు థియేటర్ ఆర్టిస్ట్ గా చేసింది. ‘నక్షత్ర’ అనే వెబ్ సిరీస్ లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో దర్శకుడు నాగ్ అశ్విన్ దృష్టిలో పడి ‘జాతిరత్నాలు’ సినిమాలో అవకాశం అందుకుంది. ఈ సినిమా తర్వాత క్రేజీ హీరోయిన్ గా మారి పలు పెద్ద నిర్మాణ సంస్థల నుంచి ఆఫర్స్ అందుకుంటుందోంది. కాని వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఒప్పుకోవడం లేదట. ఎవైతే తనకి సెట్ అవుతాయో ఆ కథలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని సమాచారం. ఇక జాతిరత్నాలు ప్రమోషన్స్‌లో ఏకంగా ప్రభాస్ ప్రశంసలు అందుకుంది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on ఏప్రిల్ 24, 2021 at 9:00 సా.