Jr NTR: తాత నుంచి నేర్చుకున్నది.. ఫ్యాన్స్ కు నేనిచ్చేది అదే.. ఎన్టీఆర్ వైరల్ కామెంట్స్!

Akashavani

Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్.. టాలీవుడ్ ప్రపంచానికి ఈ పేరు ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రం ద్వారా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఎన్టీఆర్.. ఆపై సినిమాల్లో నటించి తాతకు తగ్గ మనవడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక తన నటనతో ఎంతో మంది అభిమానులను ఆకట్టుకున్నాడు.

ఇక అదే క్రమంలో ఎన్టీఆర్ స్టార్ హీరో స్థాయికి ఎదిగి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగి పోతున్నాడు. ఇక ఇటీవల దర్శకధీరుడు రాజమౌళి ప్రాణం పోసిన త్రిబుల్ ఆ చిత్రం ద్వారా ఎన్టీఆర్ పాన్ ఇండియా స్థాయిలో హడావిడి చేస్తున్నాడు. ఇక ఈ సినిమా ఈ మధ్య విడుదల కాగా బాలీవుడ్ ప్రేక్షకులను సైతం ఫిదా చేసింది. మొత్తానికి ఎన్టీఆర్ బాలీవుడ్ ప్రేక్షకులతో మంచి ర్యాపో పెంచుకున్నాడు.

ఇక ఈ సినిమా విడుదల అయినా మరుసటి రోజు నుంచి పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ చిత్ర బృందం ఆ రెస్పాన్స్ ను ఎంజాయ్ చేస్తూ యమా చిల్ అవుతున్నారనే చెప్పవచ్చు. ఇక ఇద్దరు స్టార్ హీరోలు బాలీవుడ్లో ఈ చిత్రానికి సంబంధించి కొన్ని ఇంటర్వ్యూ లకు అటెండ్ అవుతున్నారు.

Jr NTR: తాత నుంచి నేర్చుకున్నది.. ఫ్యాన్స్ కు నేనిచ్చేది అదే.. ఎన్టీఆర్ వైరల్ కామెంట్స్!
Jr NTR: తాత నుంచి నేర్చుకున్నది.. ఫ్యాన్స్ కు నేనిచ్చేది అదే.. ఎన్టీఆర్ వైరల్ కామెంట్స్!

Jr NTR: ఎన్టీఆర్ చివరిగా తన తాత దగ్గర నేర్చుకుంది..ఫ్యాన్స్ కు ఇవ్వాలనుకుంటే ఇదే!

ఇక అదే క్రమంలో ఎన్టీఆర్ బాలీవుడ్ లో ప్రముఖ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో తన తాత గారి దగ్గర ఎన్టీఆర్ ఎం నేర్చుకున్నాడో తెలిపాడు. సమాజానికి మనం ఏదైనా చేయాలి. ఈ దేశ పౌరుడిగా మనం పొందిన ప్రేమని ఇతరులకు కూడా పంచాలి. అనేవి తాతగారు నుంచి నేర్చుకున్నాను అని ఎన్టీఆర్ తెలిపాడు.

ఇక దీన్ని నా అభిమానులకు ఎలా ఇవ్వాలి అనే విషయం గురించి ఎన్టీఆర్ ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటానని ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇక ఇటీవల విడుదలైన ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ చిత్రం థియేటర్లలో ఇంకెన్ని రోజులు హడావిడి చేస్తుందో చూడాలి.

- Advertisement -