K. V. Vijayendra Prasad : గాసిప్స్, అంచ‌నాలకు c/o అడ్ర‌స్ విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌..

Ra One

K. V. Vijayendra Prasad (విజ‌యేంద్ర‌ప్ర‌సాద్) సాధార‌ణంగా సినీ ప‌రిశ్ర‌మ‌లో గాసిప్స్ అనేవి వ‌స్తూనే ఉంటాయ‌ని ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. అయితే అన్ని పుకార్ల మాటెలా ఉన్నా..కొన్ని గాసిప్స్ కు మాత్రం క్రేజీ మామూలుగా ఉండ‌దు.

అలాంటి క్రేజీ గాసిప్స్ ను లీక్ చేసి మూవీ ల‌వ‌ర్స్ లో ఎక్జ‌యిటిమెంట్‌ను పెంచే వ్య‌క్తులు కొంత‌మందే ఉంటారు. అందులో టాప్ ప్లేస్‌లో ఉంటారు రాజ‌మౌళి తండ్రి లెజెండ‌రీ రైట‌ర్ విజ‌యేంద్ర‌ప్ర‌సాద్. ఈ ర‌చ‌నా దిగ్గ‌జం ఇటీవ‌లే వ‌చ్చిన పాన్ ఇండియా ప్రాజెక్టుకు అద్బుత‌మైన క‌థ‌ను అందించారు. రాజ‌మౌళి స‌క్సెస్ సీక్రెట్ ఏంటంటే..విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సినిమా క‌థ‌ను అందించ‌డం మొద‌టి స్టెప్పు అయితే..ఆ త‌ర్వాత సినిమాపై ప్రేక్ష‌కుల్లో ఎక్జ‌యిట్‌మెంట్ ను క‌లిగించ‌డం ఒక ఎత్తు. ఆ విష‌యంలో విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ ను మించిన వారుండ‌రేమో అంటే అతిశ‌యోక్తి కాదు. ఏదో ఇంట‌ర్వ్యూలోనో, చిట్ చాట్‌లోనో రాజ‌మౌళి ప్రాజెక్టుల గురించి ఏదో ఒక లీక్ ఇస్తుంటారు.

ఓ వైపు స‌మాచారం ఇస్తున్న‌ట్టే ఇచ్చి..మెలిక పెడుతూ గాసిప్ లా బ‌య‌ట‌కు వ‌దులుతుంటాడు. విజ‌యేంద్రప్ర‌సాద్ చెప్పే లీక్స్ ప‌బ్లిసిటీకి ఉప‌యోగ‌ప‌డుతూనే..మ‌రోవైపు సినిమా గురించి కొంత స‌మాచారం కూడా ఆడియెన్స్ కు అందించేలా ఉంటాయి. తాజాగా మ‌హేశ్ బాబుతో చేయ‌బోతున్న సినిమా ఎలా ఉండబోతుందో చెప్పి..ఈ చిత్రంపై అంచ‌నాలను ఇప్ప‌టి నుంచే ప్రేక్ష‌కుల్లో పెంచేస్తున్నాడీ పాన్ ఇండియా రైట‌ర్. మ‌హేశ్ బాబుతో చేయ‌బోయే సినిమా ద‌క్షిణాఫ్రికా అడ‌వుల నేప‌థ్యంలో అడ్వెంచ‌ర‌స్ ఫిలింగా ఉండ‌బోతుంద‌ని..జ‌క్క‌న్న సినిమా షురూ చేయ‌కముందే కావాల్సినంత హైప్ క్రియేట్ చేయ‌డ‌మే కాదు..మంచి ప‌బ్లిసిటీ కూడా అందిస్తున్నాడు.

గ‌తంలో భీమ్లానాయ‌క్ విడుద‌ల‌కు ముందు ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించి లీక్స్ ఇస్తూ..భీమ్లా నాయ‌క్ ను ప‌రోక్షంగా ప్ర‌మోట్ చేశాడు విజ‌యేంద్ర‌ప్రసాద్‌. అల్లు అర్జున్ న‌టించిన పుష్ప గురించి మాట్లాడి..వారికి హెల్ప్ చేశాడు.

- Advertisement -