K vishwanath : కళాతపస్విగా కె విశ్వనాథ్ గారికి తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతటి పేరుందో అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలో సౌండ్ రికార్డర్‌గా ఎంట్రీ ఇచ్చిన విశ్వనాథ్ గారు అక్కినేని నాగేశ్వర రావు గారి ప్రోద్భలంతో దర్శకుడిగా మారారు. ప్రముఖ దర్శకులు ఆదుర్తి సుబ్బారావు పరిచయం కావడంతో ఆయన వద్ద కొన్నాళ్ళు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఆత్మ గౌరవం సినిమాతో విశ్వనాథ్ దర్శకుడిగా మారాడు. మొదటి సినిమాకే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది అవార్డును సాధించారు.

kamal-balu-are-producers-for-k-vishwanath-first-movie
kamal-balu-are-producers-for-k-vishwanath-first-movie

కె విశ్వనాథ్ మొదటి సినిమాకి గొల్లపూడి మారుతీరావు, ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి, భమిడిపాటి రాధాకృష్ణ, దుక్కిపాటి మధుసూదనరావు లాంటి వారితో పనిచేయడంతో మంచి టీం ఏర్పడింది. ఆ తర్వాత కె విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సిరిసిరిమువ్వ సినిమా పెద్ద విజయాన్ని సాధించడంతో చిత్ర పరిశ్రమలో విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక 1978 లో కె. విశ్వనాథ్ రచన దర్శకత్వంలో రూపొందిన సీతామాలక్ష్మి మరో మెట్టు పైకెక్కించింది. ఈ సినిమా ద్వారా తాళ్ళూరి రామేశ్వరి చిత్ర పరిశ్రమకి పరిచయమయ్యారు.

K vishwanath : కమల్, బాలు పట్టుపట్టడంతో విశ్వనాథ్ గారు మొదటిసారి స్క్రీన్ మీద కనిపించారు.

అంతేకాదు ఈ సినిమాలో నటనకు గాను ఆమె నంది అవార్డును గెలుచుకున్నారు. ఇక ఈ చిత్రాన్ని తమిళంలో ఎనిప్పడిగళ్ పేరుతో, 1980 లో హిందీలో మిథున్ చక్రవర్తి, జరీనా వాహబ్ లతో సితార పేరుతో నిర్మించారు. ఈ రెండు భాషల్లోను సూపర్ హిట్ గా నిలిచింది. ఇక 1992 లో వచ్చిన స్వాతికిరణం సంగీత ప్రధానంగా రూపొందిన సినిమా. వరుస హిట్స్ అందుకుంటున్న విశ్వనాథ్ గారికి ఖాతాలో చేరిన మరో అద్భుతమైన సినిమా. ఈ సినిమా ద్వారా మమ్ముట్టి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర చేసిన సినిమా. 1995 లో ఈయన నుంచి వచ్చిన శుభ సంకల్పం మరపురాని చిత్రంగా నిలిచింది. గాయకుడు ఎస్.పి.బాలసుబ్రమణ్యం ఈ చిత్రానికి నిర్మాత కావడం విశేషం. కమల్ హాసన్ మరొక నిర్మాతగా రూపొందిన ఇందులో కమల్, బాలు పట్టుపట్టడంతో విశ్వనాథ్ గారు మొదటిసారి స్క్రీన్ మీద కనిపించారు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 22, 2021 at 8:00 సా.