Keerthi Suresh: మహానటి సినిమా తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు కీర్తి సురేశ్ ఖాతాలో ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ చేరలేదు. చేసిన సినిమాలన్ని వరుసబెట్టి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. కరోనా సమయంలో కీర్తి చూపించిన జోరు మరే హీరో, హీరోయిన్ కూడా చూపించలేదు. అంతగా వరుసబెట్టి సినిమాలను కమిటవడమే కాదు..థియేటర్స్ మూతపడి ఉన్నా కూడా ఓటీటీలో రిలీజ్ చేశారు. పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాలు రెండూ ఓటీటీలో విడుదలయ్యాయి.
కానీ, ఈ రెండు సినిమాలు ఆశించిన సక్సెస్ అందుకోలేకపోయాయి. ఆ తర్వాత వచ్చిన రంగ్ దే, గుడ్ లక్ సఖి, మరక్కార్, అణ్ణాత్త సినిమాల పరిస్థితీ అదే. వీటిలో ఏ ఒక్క సినిమా కీర్తికి సక్సెస్ ఇవ్వలేదు. ప్రస్తుతం అమ్మడి చేతిలో సినిమాలైతే బాగానే ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో చెల్లి పాత్రను చేస్తోంది. ఇందులో తమన్నా హీరోయిన్. ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమాలో కీర్తి హీరోయిన్. అలాగే, నాని సరసన దసరా సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. తమిళంలో ఉదయనిధి స్టాలిన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో కుడా కీర్తి హీరోయిన్‌గా చేస్తోంది.

Keerthi Suresh: ఇలాంటి ప్రయోగం ఎందుకు అని కామెంట్స్ ..?
ఇవి కాకుండా సొంత నిర్మాణ సంస్థలో ఓ సినిమాను చేస్తున్న కీర్తి సురేశ్ టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ సరసన కూడా ఓ సినిమా చేస్తున్నట్టు సమాచారం. కృష్ణ చైతన్యతో శర్వానంద్ ఓ సినిమాను చేస్తుండగా దానిలో ఓ బిడ్డకు తండ్రిగా నటిస్తున్నాడు. అయితే, ఈ సినిమాలో ముందు హీరోయిన్‌గా కృతి శెట్టిని తీసుకోవాలనుకున్నారట మేకర్స్. కానీ, తల్లి పాత్ర కావడంతో ఈ యంగ్ బ్యూటీ నో చెప్పిందని..దాంతో ఆ స్థానంలో కీర్తిని ఎంచుకున్నారని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఇప్పటికే పెంగ్విన్ సినిమాలో తల్లిగా నటించిన కీర్తి మరోసారి శర్వానంద్ సినిమాలో తల్లిగా కనిపించనుందని తెలుస్తోంది. అసలే శర్వాకు హిట్స్ దక్కడం లేదు. మరి ఇప్పుడు ఇలాంటి ప్రయోగం ఎందుకు అని కామెంట్స్ వినిపిస్తున్నా యి.