Kiara Advani : కియారా అద్వానీ టాలీవుడ్‌లో భరత్ అనే నేను సినిమాతో ఎంట్రీ ఇచ్చి భారీ హిట్ అందుకుంది. మొదటి సినిమానే సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో అవకాశం అందుకోవడం గొప్ప విషయం. ఈ సినిమాతో కియారా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అవుతుందనుకున్నారు. అలాగే రెండవ సినిమా మెగా పవర్ స్టార్ రాం చరణ్‌తో చేసింది. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు. ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజై బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది.

kiara-advani-re enters tollywood after ten years
kiara-advani-re enters tollywood after ten years

దాంతో ఈ బ్యూటీ మళ్ళీ టాలీవుడ్‌లో కనిపించలేదు. కానీ బాలీవుడ్‌లో మాత్రం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది. స్టార్ హీరో అక్షయ్ కుమార్ లాంటి వాళ్ల సరసన భారీ ప్రాజెక్ట్స్‌లో నటించే అవకాశాలు అందుకుంటోంది. వరుస బాలీవుడ్ సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న కియారా అద్వానీని మన మేకర్స్ తెలుగు సినిమాలలో నటింప చేసేందుకు చాలాసార్లు ట్రై చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Kiara Advani : కియారా అద్వానీ ఈ రెండిట్లో ఒక సినిమా ఒకే చేసే అవకాశం ఉందంటున్నారు.

కానీ కియారా టాలీవుడ్ సినిమా మాత్రం ఓకే చేయడం లేదు. ఎట్టకేలకి 10ఏళ్ళ తర్వాత మళ్ళీ టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇస్తున్నట్టు సమాచారం. సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రం శ్రీనివాస్ కాంబినేషన్‌లో రీసెంట్‌గా ఒక సినిమా ప్రకటించారు. ఈ సినిమాకి కియారాను సంప్రదించినట్లుగా తెలుస్తోంది. అలాగే కొరటాల శివ – ఎన్.టి.ఆర్ కాంబినేషన్‌లో కూడా ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ అయింది. ఈ ప్రాజెక్ట్‌కు కియారా అద్వానీ పేరే పరిశీలిస్తున్నారట. ఈ రెండిట్లో ఒక సినిమా ఒకే చేసే అవకాశం ఉందంటున్నారు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on మే 11, 2021 at 9:00 ఉద.