Kodali Nani: 2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు ఎంత బాధపడ్డాడో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు వైసీపీ వాళ్ళు అంత బాధపడుతున్నారు. ఆ బాధ నుండి వైసీపీ వాళ్ళు ఇంకా బయటకు రాలేకపోతున్నారు. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల మీద కొడాలి నాని కూడా స్పందించారు. చీప్ రాజకీయాలు చెయ్యడం చంద్రబాబు నాయుడుకు అలవాటని, అందుకే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేలను కొని, గెలిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ వదిలేసిన, మెతుకులు తింటూ కడుపు నింపుకుంటున్ననాయకుడు చంద్రబాబు నాయుడని కొడాలి చెప్పారు. మొన్నటి వరకు వచ్చేఎన్నికల్లో 175 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన వైసీపీ వాళ్ళు ఇప్పుడు, టీడీపీకి భయపడి మాట్లాడుతున్నట్టు కనిపిస్తున్నారు.

ఈ స్క్రిప్ట్ ల గొడవ ఏందీ!!
మొన్న చంద్రబాబు నాయుడు మీడియా ముందుకు వచ్చి, తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను వైసీపీ తీసుకుందని, ఇప్పుడు అదే నలుగురు ఎమ్మెల్యేలు తమ పక్షాన నిలబడ్డారని, ఇదే దేవుడు రాసిన స్క్రిప్ట్ అని బాబు చెప్పారు. ఇప్పుడు కోడాలి నాని మాట్లాడుతూ… కరెక్ట్ గా టీడీపీ స్థాపించిన రోజే లోకేష్ యొక్క ఎమ్మెల్సీ పదవి లాస్ట్ రోజు కూడా కావడం దేవుడు రాసిన స్క్రిప్ట్ అని అన్నారు.గతంలో టీడీపీ 23 సీట్లు గెలిచినప్పుడు కూడా వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ… 2014 ఎన్నికల తరువాత తమ పార్టీ నుండి 23 ఎమ్మెల్యేలను తీసుకున్న బాబుకు, ఇప్పుడు 23 సీట్లు రావడం దేవుడు రాసిన స్క్రిప్ట్ అని అన్నారు. ఈ రాజకీయాలు ఊరికే పనికిమాలిన రాజకీయాలు చేసుకోకా, ఇలా దేవుడు పేరును ఎనుదుకు వాడుకుంటున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు.
టీడీపీ పార్టీ కాదు-వ్యాపార సంస్థ
ప్రజల కోసం సీనియర్ ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీని స్థాపిస్తే, ఇప్పుడు దాన్ని చంద్రబాబు నాయుడు ఒక వ్యాపార సంస్థగా మార్చారని కొడాలి నాని తెలిపారు. రాష్ట్రంలో ఈ కొనుగోలు రాజకీయాలు స్టార్ట్ చేసిందే చంద్రబాబు నాయుడని, ప్రజల గురించి చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ఆలోచించడని, ప్రజల గురించి ఆలోచించిన నాయకుల్లో ఎన్టీఆర్, రాజశేఖర్ రెడ్డి తరువాత జగన్ నేనని కొడాలి వ్యాఖ్యానించారు. ఇప్పుడు నలుగురు ఎమ్మెల్యేలు వచ్చారని సంతోషపెడుతున్న చంద్రబాబు నాయుడుకు వచ్చే ఎన్నికల్లో అదే నాలుగు సీట్లు వస్తాయని కొడాలి జోశ్యం చెప్పారు.