Karan Johar: బాలీవుడ్ బడా మేకర్ కరణ్ జొహార్ ..సమంతను తన టాక్ షో కోసం పార్టులు పార్టులుగా బాగానే వాడుకున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇది నిజమని ఎవరైనా చెప్పేస్తారు. ఇప్పటికే, 6 సీజన్లు కంప్లీట్ చేసుకున్న కాఫీ విత్ కరణ్ బాలీవుడ్ లో పెద్ద హిట్. ఈ టాక్ షోకి ప్రత్యేకంగా అభిమానులున్నారు. యూనివర్సల్‌గా ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న ఈ షోలో కరణ్ బాలీవుడ్ స్టార్స్‌తో చేసే హంగామా అంతా ఇంతా కాదు. వీలైనంత బోల్డ్ కామెంట్స్ చేస్తూ తన షోకి మంచి రేటింగ్ వచ్చేలా ప్లాన్ చేసుకుంటాడు.
అదే స్ట్రాటజీతో ఇప్పుడు సమంతను ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవాలో అన్ని రకాలుగా తన సీజన్ 7 కాఫీ విత్ కరణ్ కోసం ఉపయోగించుకున్నారు. సమంత సినిమా లైఫ్ కంటే కూడా పర్సనల్ లైఫ్ లోని విషయాలనే పార్టులు పార్టులుగా టచ్ చేసి సమంత నుంచి సమాధానాలు రాబట్టాడు. అసలే విడాకులు తీసుకున్నప్పటి నుంచి అటు సమంత గానీ, ఇటు నాగ చైతన్య గానీ ఎందుకు వీరు విడిపోయారో అర్థం కాకా జుట్టు పీక్కుంటున్నారు. ఇలాంటి సమయంలో కరణ్ షో అంటే ఖచ్చితంగా చాలా విషయాలు చెప్పి ఉంటుందని ఆశగా ఎదురు చూశారు.

Karan Johar: సమంత వస్తే తన షోకి హైప్..!
నాగ చైతన్యని ఎక్స్ హస్బెండ్ అని చెప్పిన సమంత..మిగతా హీరోలతో ఎలా ఉంటుందో..వారికి ఎలాంటి టాగ్ ఇవ్వొచ్చో తన అభిప్రాయాలను వెల్లడించింది. ఈ కామెంట్స్ మొత్తం నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. కాగా, గత ఎపిసోడ్స్ కంటే సమంత వల్ల ఆమె అక్షయ్ కుమార్ కలిసి చేసిన ఎపిసోడ్ బాగా హైలెట్ అయింది. కరణ్ కి ఈ ఎపిసోడ్ ద్వారానే మంచి ఆదాయం కూడా బాగా వచ్చినట్టు నమోదైన టీఆర్పీ రేటింగ్స్ చెబుతున్నాయి. సమంత వస్తే తన షోకి హైప్ వస్తుందనే కరణ్ ఇన్ని స్కెచ్చులేశాడా అనుకుంటున్నారు.