Kota Srinivasa Rao: కోటా శ్రీనివాస్ రావుని కొన్ని రోజులు బ్రతికేలా చెయ్యి దేవుడా.. రామ్ చరణ్ అంటే ఏంటో ముసలోడు చూస్తాడు!

Akashavani

Kota Srinivasa Rao: టాలీవుడ్ ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా ఎంతో పేరు సంపాదించుకున్న కోటశ్రీనివాసరావు ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తున్నారు.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కోట శ్రీనివాసరావు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ ఆయనకు నటనలో పెద్దగా పొటెన్షియాలీటీ లేదని తెలియజేశారు. ఈ క్రమంలోనే కోట చేసిన వ్యాఖ్యలు సోషియల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ విధంగా కోట శ్రీనివాస్ రావు రామ్ చరణ్ కేవలం మెగాస్టార్ కొడుకు కావడం వల్లే ఆయనకు ఇలాంటి పేరు ప్రఖ్యాతులు వచ్చాయని కామెంట్ చేయడంతో పెద్ద ఎత్తున రామ్ చరణ్ అభిమానులు కోట శ్రీనివాస రావు పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ట్విట్టర్ వేదికగా ఎంతోమంది నెటిజన్లు ఈయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విభిన్న రీతిలో ట్వీట్ చేస్తున్నారు.

Kota Srinivasa Rao: మెగా పవర్ స్టార్ పవర్ ఏంటో తెలియాలి…

ట్విట్టర్ వేదికగా కొంతమంది నెటిజన్లు స్పందిస్తూ… దేవుడా కొన్ని రోజులు కోట శ్రీనివాస్ రావు గారిని బ్రతికించు రామ్ చరణ్ అంటే ఏంటో ఈ ముసలోడు చూస్తాడు అంటూ వీడియోని షేర్ చేస్తూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.చిరంజీవి కొడుకు కావటం వల్లే ఆయనకు పేరు వచ్చిందని చెప్పిన కోట శ్రీనివాస రావు ఎన్టీఆర్, మహేష్ బాబు, బన్నీ నటన ఎంతో అద్భుతంగా ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపాయి. అయితే మా ఎన్నికల సమయంలో కూడా ప్రకాశ్ రాజ్ ప్యానల్ పై విమర్శలు చేస్తూ మంచు కుటుంబానికి మద్దతు తెలిపారు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి ఈయన మెగా కుటుంబం పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది.

- Advertisement -