Nani movie : సూపర్ స్టార్ మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్టుగా నటించినప్పుడే అభిమానుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. రాజకుమారుడుతో హీరోగా కెరీర్ ప్రారంభించిన మహేష్ ఒక్కడు సినిమాతో స్టార్‌గా టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, మార్కెట్‌ను సంపాదించుకున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ కొడుకుగా సినీ కెరీర్ ప్రారంభించిన మహేష్ బాబు అదే సూపర్ స్టార్ ఇమేజ్‌ను తను సంపాదించుకున్నాడు. మహేష్ బాబుతో సినిమా చేసేందుకు దర్శక, నిర్మాతలు ఎప్పుడూ రెడీగా ఉంటారు.

krishna-commented-on-mahesh-babu-nani-movie

ఇక మహేష్‌లో దాదాపు తండ్రి కృష్ణ గారి క్వాలిటీస్ ఉండటం గొప్ప విషయం. సినిమాల ఎంపికలో ..వ్యక్తిగతంగా ఇద్దరిలో సమానమైన క్వాలిటీస్ ఉంటాయి. అందుకే తండ్రి మాదిరిగానే మహేష్ కూడా కొన్ని డేరింగ్ డెసిషన్స్ తీసుకొని నాని వంటి సినిమాలు ఒప్పుకున్నాడు. ఓ కొత్త హీరో చేయాల్సిన నాని మహేష్ ఒప్పుకోవడం ఎంతో రిస్క్ తో కూడుకున్న విషయం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఖుషి సినిమాతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన ఎస్ .జె సూర్య దర్శకత్వంలో నాని తెరకెక్కింది.

Nani movie : నాని ఈ సినిమా మహేష్ చేసి రాంగ్ స్టెప్ వేశాడు.

మహేష్ సోదరి మంజుల ఈ సినిమాను నిర్మించారు. అమీషా పటేల్ హీరోయిన్‌గా ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించాడు. ఇంత భారీ కాస్ట్ క్రూతో నిర్మించిన ఈ సినిమా ఫ్లాప్‌గా మిగింది. కాన్సెప్ట్ హాలీవుడ్ స్థాయిదైనా కూడా అది మహేష్ చేయడం కరెక్ట్ డెసిషన్ కాదు. సినిమా ప్రీమియర్ చూశాక కృష్ణ గారి అభిప్రాయం ఇదే. నాని హిట్ అయితే మహేష్ స్టార్ కాదు…అని మహేష్‌తో ఒకే ఒక్క మాట చెప్పి సినిమా కొత్తవాడు చేయాల్సింది..అని తేల్చి చెప్పారు. నిజంగానే ఈ కథ కొత్త హీరోయితే లాంచింగ్‌కు పర్ఫెక్ట్. కానీ మహేష్ ఇది చేసి రాంగ్ స్టెప్ వేశాడు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on మే 26, 2021 at 1:11 సా.