Krishnam Raju: టాలీవుడ్ లో దాదాపుగా 187 కి పైగా చిత్రాలలో హీరోగా మరియు ప్రతి నాయకుడు పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించినటువంటి రెబల్ స్టార్ కృష్ణంరాజు గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే నటుడు కృష్ణంరాజు కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా రాజకీయాల్లోకి కూడా వచ్చి మంత్రి పదవులను చేపట్టి ప్రజలకు ఎంతో సేవ చేశాడు. ఇక రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇంటి నుంచి హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా తన పెదనాన్న వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతున్నాడు. అయితే ఇటీవలే నటుడు కృష్ణంరాజు పలు అనారోగ్య సమస్యల కారణంగా హైదరాబాదులోని తన సొంత నివాసంలో మృతి చెందిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో నటుడు కృష్ణంరాజు వ్యక్తిగత జీవితం గురించి సోషల్ మీడియా మాధ్యమాలలో ఇంటర్నెట్లో నెటిజెన్లు తెగ వెతుకుతున్నారు.
అయితే నటుడు కృష్ణంరాజు 1966వ సంవత్సరంలో చిలక గోరింక అనే చిత్రం ద్వారా తన సినీ కెరియర్ని ఆరంభించాడు. ఆ తరువాత ఎన్నో హిట్లు అందుకుంటూ పలు ఎత్తు, పల్లాలను కూడా చవిచూశాడు. అయితే నటుడు కృష్ణంరాజు సినిమాల్లో నటించడమే కాకుండా పలు చిత్రాలకు నిర్మాతగా సహనిర్మాతగా కూడా వ్యవహరించి బాగానే సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఇక కృష్ణంరాజు వ్యక్తిగత జీవితానికి వస్తే 1965 వ సంవత్సరంలో సీతాదేవి అనే మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కాగా సీతాదేవి అనుకోకుండా 1995 వ సంవత్సరంలో జరిగినటువంటి ఓ రోడ్డు ప్రమాదంలో మరణించింది. అయితే అప్పటికే వీరికి ఒక పాప కూడా ఉంది.
తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య సీతాదేవి మరణించడంతో కృష్ణంరాజు కొన్ని రోజులపాటు తీవ్ర మానస్థాపనకి గురై ఒంటరి జీవితాన్ని గడపడం ఆరంభించాడు. దాంతో కుటుంబ సభ్యులు కృష్ణంరాజు ఆవేదనని అర్థం చేసుకొని అతడి మంచి మేలుకై శ్యామలాదేవి తో 1996వ సంవత్సరంలో వివాహం జరిపించారు. కాగా ప్రస్తుతం వీరికి ముగ్గురు కూతుర్లు కూడా ఉన్నారు. అయితే నటుడు కృష్ణంరాజు మరో యువతని కూడా దత్తత తీసుకొని పెంచి పెద్ద చేశారు. కాగా ప్రస్తుతం కృష్ణంరాజుకి ఐదు మంది సంతానం.
అయితే నటుడు కృష్ణంరాజు అనారోగ్య సమస్యల కారణంగా మరణించడంతో ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురైంది. అంతేకాకుండా చాలామంది నెటిజెన్లు మరియు రెబల్ స్టార్ అభిమానులు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కృష్ణంరాజు ఆత్మకు శాంతి కలగాలని సోషల్ మీడియాలో ప్రార్థనలు చేశారు. అలాగే అంతిమ వీడ్కోలకు కూడా వేల సంఖ్యలో జనాలు తరలివచ్చారు.