KTR: బీజేపీని ఎలాగైనా కేంద్రంలో అధికారం నుండి దించడానికే కేసీఆర్ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు. బీజేపీని అడ్డుకోవడానికి వచ్చే ఏ చిన్న అవకాశాన్ని కూడా బీఆర్ఎస్ వదులుకోవడం లేదు. ఇప్పుడు మరోకొత్త ప్లాన్ తో ఇప్పుడు కేటీఆర్ ముందుకు వచ్చాడు. రాష్ట్రంలో ఎలాగైనా అధికారంలోకి రావడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుకట్ట వెయ్యడానికి బీఆర్ఎస్ నాయకులు వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పుడు వ్యూహ కర్తగా కేటీఆర్ బయలుదేరారు. అయితే ఈసారి కేటీఆర్ వ్యూహానికి బీజేపీ దొరికిపోవడం తప్పా వేరే ఛాన్స్ ఎందుకంటే కేటీఆర్ వేసిన వ్యూహం అలాంటిది. ఈవ్యూహానికి నిర్మలా సీతారామన్ ను సెంటర్ చేసుకున్నారు. ఈ వ్యూహాన్ని బీజేపీ ఎలా అడ్డుకుంటుందో వేచి చూడాలి.
కేటీఆర్ వ్యూహమేంటి?
బీజేపీని దెబ్బకొట్టడానికి రాష్ట్రానికి పారిశ్రామిక అభివృద్ధి కోసం సహాయం చెయ్యాలని కోరారు. జహీరాబాద్ నిమ్జ్‌లో మౌలిక సదుపాయాల కల్పన కోసం, హైదరాబాద్ – వరంగల్ పారిశ్రామిక కారిడార్‌కు కూడా నిధులు ఇవ్వాలని కేటీఆర్ కోరారు. హైదరాబాద్ – నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్‌కు ఆర్థిక సాయం చేయాలన్నారు. హైదరాబాద్ – విజయవాడ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని పేర్కొన్నారు. అలాగే హైదరాబాద్ ఫార్మాసిటీకి బడ్జెట్‌లో నిధులు కేటాయించాలన్నారు. చేనేత రంగానికి జీఎస్టీ మినహాయించాలని కేటీఆర్ సూచించారు. ఐటీఐఆర్ లేదా సమాన ప్రాజెక్టు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలన్నారు. ఇవన్నీ బీజేపీ చెయ్యలేదని, చెయ్యదని తెలిసే కేటీఆర్ ఇవన్నీ కోరాడని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
బీజేపీ సమాధానం ఏంటి??
రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కేవలం మతం పేరును వాడుకోవడం తప్పా వేరే చేసిందేమి లేదు. కనీసం రాష్ట్రానికి బీజేపీ నాయకులు తెచ్చిన నిధులో, ప్రాజెక్టో ఒక్కటి కూడా లేదు. పైగా చెయ్యడానికి రాష్ట్రంలో మత కలహాలు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తుంది. రాష్ట్రానికి బీజేపీ ఒక్క పని చెయ్యలేదని కేసీఆర్ ఎప్పటి నుండో చెప్తున్నాడు. ఇప్పుడు వీటిని కూడా బీజేపీ చెయ్యకపోతే ఇక బీజేపీ రాష్ట్రానికి చేసిందేమి లేదని చెప్పడానికి కేటీఆర్ పెద్ద ప్లాన్ వేశారు. ఈ ప్లాను తిప్పి కొట్టాలంటే కేటీఆర్ అడిగిన వాటి కోసం నిధులు కేటాయించాలి. ఇలా రాష్ట్రానికి పనికొచ్చే పనులు బీజేపీకి చేతకాదు. కాబట్టి ఈ విషయంలో బీజేపీ నోరు మూసుకొని కూర్చోవడం తప్పా చేసేదేమి లేదు. బీజేపీ చాలా తెలివిగా కేటీఆర్ ఇరికించారు. మత రాజకీయాలు మాత్రమే తెలిసిన బీజేపీ, కేటీఆర్ స్మార్ట్ ప్లాన్ ను తిప్పికొట్టడం సాధ్యం కాదు.