Kushboo: సీనియర్ నటి కుష్బూ గురించి మనందరికీ తెలిసిందే. అప్పట్లో స్టార్ హీరోలు అందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఖుష్బూ టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ సినిమాలలో కూడా నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది ఖుష్బూ. అయితే తమిళనాడులో ఒకప్పుడు ఆమెకు అభిమానులు ఏకంగా గుడి కట్టారు అంటే ఆమెకు ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఖుష్బూకీ కూడా ఇతర హీరోయిన్ల మాదిరిగానే కెరిర్ ఆరంభంలో వేధింపులను ఎదుర్కొందట. అది కూడా ఒక తెలుగు సినిమా విషయంలో ఆమె వేధింపులను ఎదుర్కొందట.
ఇదే విషయాన్ని ఖుష్బూనే స్వయంగా వెల్లడించింది. ఖుష్బూ, వెంకటేష్ నటించిన సినిమా కలియుగ పాండవులు. ఈ సినిమాకు కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. అయితే ఈ కలియుగ పాండవులు సినిమా షూటింగ్ సమయంలో ఒక వ్యక్తి వెనుక నుంచి వచ్చి ఖుష్బూ బ్యాక్ ని తాకాడట. వెంటనే ఖుష్బూ అతని చెంప చెల్లుమనిపించిందట. ఈ సంఘటన జరిగినప్పుడు ఆమె పక్కన సురేష్ బాబు,రామానాయుడు ఇద్దరు కూడా అక్కడే ఉన్నారట. వాళ్లు కూడా ఖుష్బూ కీ సపోర్ట్ గా పడ్డారు అని చెప్పుకొచ్చింది ఖుష్బూ.
Kushboo: షూటింగ్ లో ఒక వ్యక్తి చెంప చెల్లుమనిపించిన ఖుష్బూ..
అలా తనకు ఎదురైనా ఒక చేదు అనుభవం గురించి తెలిపింది ఖుష్బూ. తెలుగులో నటిస్తూ ఆ తర్వాత నెమ్మదిగా తమిళ ఇండస్ట్రీ పై బాగా ఫోకస్ చేసిందట.
అలా ఆ తరం స్టార్ హీరోలతో దాదాపుగా 150కు పైగా సినిమాల్లో నటించిందట ఖుష్బూ. తెలుగులో అగ్ర హీరోలు అయిన నాగార్జున, వెంకటేష్ తో పాటు చిరంజీవితో కూడా స్క్రీన్ ను షేర్ చేసుకుంది. ఆ తరువాత తమిళ సీనియర్ హీరో ప్రభుతో ప్రేమాయణం నడిపిన ఖుష్బూ ఆ తర్వాత దర్శకుడు సి. సుందర్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. ఇకపోతే ప్రస్తుతం
ఖుష్బూ జబర్దస్త్ షో కి జడ్జ్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తనపై పంచులు వేసిన నవ్వుతూ, స్కిట్ మధ్యలో కలుగజేసుకొని తనదైన శైలిలో పంచులు వేస్తూ అలరిస్తోంది.