L .B. Sriram : సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్ అనుకొని వాటిని క్యాన్సిల్ చేసిన సందర్భాలు కోకొల్లలు ఉంటాయి. పెద్ద నిర్మాణ సంస్థలు అడ్వాన్సులు ఇచ్చి కూడా ఆ తర్వాత వేసుకున్న లెక్కలతో సినిమా రిలీజయ్యాక ఆ స్థాయి బిజినెస్ అవుతుందా లేదా అనే సందేహాలు కలగడం..లేదా పక్కవాళ్ళు కామెంట్ చేసి డిసప్పాయింట్ చేయడంతో అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళని నమ్మలేక..సినిమా లాస్ అయితే రిస్క్ అని భావించి మళ్ళీ క్రేజ్ ఉన్న వాళ్ళని తీసుకొని సినిమాలు చేస్తుంటారు. ఇది అవకాశం అందుకున్న వాళ్ళకి బాగానే ఉన్నప్పటికి అడ్వాన్స్ ఇచ్చి కూడా ఆ అవకాశం లేకుండా చేసిన వాళ్ళ వల్ల మాత్రం బాధపడే వారు జీవితాంతం జరిగిన పరాభవాన్ని మర్చిపోలేరు.

ప్రముఖ రచయిత, నటుడు, దర్శకుడు ఎల్. బి. శ్రీరామ్ కూడా ఇలాంటి పరాభవాన్ని చూడాల్సి వచ్చింది. ఆ సినిమా మిథునం. ఈ సినిమాకి ముందు అనుకుంది ఎల్. బి. శ్రీరామ్ ని. ఆయనకి నిర్మాత పెద్ద మొత్తం అడ్వాన్స్ కూడా ఇచ్చారు. అయితే రెండే పాత్రలతో సినిమా మొత్తం సాగుతుంది. ఈ సినిమాకి ప్రముఖ రచయిత, నటుడు, దర్శకుడు తణికెళ్ళ భరణి దర్శకత్వం వహించారు. అయితే వింటర్ సీజన్‌లో సినిమా చేయాలని మేకర్స్ అనుకున్నారు. కానీ అందుకు ఎల్. బి. శ్రీరామ్ ఒప్పుకోలేదు. ఒక్కరోజు ఆలస్యం అయినా ఆలోచన మారిపోతుంది. అన్ని రోజులు ఆగడం కరెక్ట్ కాదు, వెంటనే చేసేద్దాం అని అన్నారట.
L .B. Sriram : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం దక్కిన మిథునం సినిమా క్రెడిట్ ఎల్. బి. శ్రీరామ్ కి దక్కాల్సింది.
మొత్తానికి ఎల్. బి. శ్రీరామ్ సినిమా చేయాలని డిసైడయ్యారు. కానీ ఆయన పక్కన కొత్త అమ్మాయి అయితే ఏం బావుంటుందని చర్చలు సాగాయట. దాంతో కొంతమందిని అనుకున్న తర్వాత ఫైనల్‌గా లక్ష్మీ ని తీసుకున్నారు. ఆ తర్వాత లక్ష్మీ గారి పక్కన ఎల్. బి. శ్రీరామ్ ఏంటండీ అనే టాపిక్ వచ్చింది. అంతే అక్కడ నుంచి సినారియో మారిపోయింది. ఎల్. బి. శ్రీరామ్ కి ఈ అవకాశం పోయింది. ఎల్. బి. శ్రీరామ్ స్థానంలో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం వచ్చారు. ఇది ఆయన చాలా అవమానంగా భావించారు. దాంతో ఆయనకి ఇచ్చిన ఆ పెద్ద మొత్తం అడ్వాన్స్ తిరిగి ఇచ్చేశారు. ఇది నిర్మాతకి షాకిచ్చిన విషయం. మొత్తానికి అలా ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం దక్కిన మిథునం సినిమా క్రెడిట్ ఎల్. బి. శ్రీరామ్ కి దక్కాల్సింది.