Lahari Shari : దేశంలో అత్యంత ప్రజాదరణ పొందుతున్న రియాలిటీ షో బిగ్ బాస్.. అప్పటి వరకు ఎవరికీ తెలియని వ్యక్తి కూడా బిగ్ బాస్ షో లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత ఆ పేరు తెలియని వారు ఎవరూ ఉండరు అని ఎలాంటి సందేహం లేకుండా చెప్పవచ్చు. అలాగే కొందరు సామాన్యులు హౌస్ లోకి వెళ్ళి ఫాలోయింగ్ ని సంపాదించుకుంటారు మరికొందరు సెలబ్రెటీలు హౌస్ లోకి వెళ్లి బయటకి నెగిటివిటీ ని మూటగట్టుకొని వస్తారు. ఇక ఇది ఇలా ఉంటే బిగ్బాస్ సీజన్ 5 లో కాంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి రెండు తెలుగు రాష్ట్ర ప్రేక్షకులకు పరిచయమైన లహరి షారీ. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తరువాత తన జోరును కొనసాగిస్తోన్నారు. ఫిల్మ్ అండ్ టీవీ ఇండస్ట్రీలో కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు.
అయితే ఈ బ్యూటీకి ఎప్పటి నుంచో ఉన్న ఒక కల నెరవేరిందట. కింగ్ నాగార్జున, యువ సామ్రాట్ నాగచైతన్య లతో ఓ రోజు స్పెండ్ చేయలని తనకు ఓ కోరిక ఉండేదట. ఆ కోరిక తాజాగా నెరవేరిందని లహరి సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. తన కోరికను తండ్రి కొడుకులు తీర్చారని లహరి తెలిపింది. నాగార్జున గారిని కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది! అతను చూపించిన ఆతిథ్యం గురించి నేను గొప్పగా మరియు సంతోషించాను. అతను సౌమ్య మరియు వినయపూర్వకమైన వ్యక్తి అన్ని లహరి పేర్కొంది. ఒక మరపురాని ప్రయాణం జరిగింది.. నాగార్జున సర్ మరియు నాగ చైతన్య సర్ ఇద్దరినీ కలిసినందుకు వినయంగా భావించానని పేర్కొంది
2022 జనవరి 7న నా కల నెరవేరింది..మీలాంటి గొప్ప వ్యక్తులతో ఒక రోజంతా గడిపేందుకు అవకాశం ఇచ్చిన నాగార్జున , చైతన్య లకు థాంక్స్ అన్ని .. వాళ్ళతో గడిపిన అద్భుత అనుభూతిని సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ కింద లహరి రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. అందులో అక్కినేని ప్రైవేట్ జెట్ లో నాగార్జున, చైతన్య లతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. అక్కినేని ఫ్యామిలీ ఎప్పుడూ అంతే. అభిమానుల కల నెరవేర్చడంలో ముందుంటారు’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.