Lakshmi Parvati: ఇటీవల తాజాగా నందమూరి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్న విషయం తెలిసిందే. ఉమామహేశ్వరి మరణంతో ఒక్కసారిగా నందమూరి కుటుంబ సభ్యులు తీవదిబ్బందికి లోనయ్యారు. ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకొని మరణించింది అన్న విషయం తెలిసిందే. ఉమామహేశ్వరి తనకున్న అనారోగ్య సమస్యల కారణంగా ఒత్తిడి దృష్టిలో పెట్టుకొని వాటిని తట్టుకోలేక ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది అని నందమూరి కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి గౌరవం ఉన్న నందమూరి ఫ్యామిలీలో ఈ విధంగా జరగడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.
ఉమా మహేశ్వరి మరణించిన తర్వాత తాజాగా ఎన్టీఆర్ రెండవ భార్య లక్ష్మీపార్వతి స్పందించింది. ఎన్టీఆర్ ఫ్యామిలీలో జరుగుతున్న సంఘటనల గురించి ఆమె ఎంతో బాధపడ్డారు. ఈ సందర్భంగా లక్ష్మి పార్వతి మాట్లాడుతూ.. ఉమామహేశ్వరి ఎందుకు ఎలా చనిపోయింది అన్నది పెద్ద మిస్టరీ అని తెలిపింది. అయితే ఆమె మృతి పై చంద్రబాబు నీచ రాజకీయాలు తెలిసిన వారు ఆయనని కచ్చితంగా అనుమానిస్తారు. ఎందుకంటే నందమూరి కుటుంబానికి చంద్రబాబు ఒక శనిలా పట్టుకుని వాళ్ళను పీడిస్తున్నాడు అని తెలిపింది లక్ష్మీపార్వతి. సింహ గర్జనకు రెడ్డి అవుతున్న సమయంలోనే చంద్రబాబు చర్యల వల్లే ఎన్టీఆర్ గుండెపోటుతో మరణించాడని, ఎన్టీఆర్ కు తెలియకుండానే బ్యాంక్ అకౌంట్స్ సీజ్ చేసి అధ్యక్ష పదవిని కూడా లాక్కొని నన్ను ఒక బూచిగా నా కుటుంబాన్ని నమ్మించాడు అని చెప్పుకొచ్చింది.
Lakshmi Parvati: చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేసిన లక్ష్మీపార్వతి..
అదేవిధంగా హరికృష్ణకు కూడా మంత్రి పదవి ఇచ్చి ఆరు నెలల లోపే తిరిగి లాగేసుకున్నాడని ఆమె తెలిపింది. ఆ సమయంలో హరికృష్ణ మానసికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడని ఆమె చెప్పుకొచ్చింది. అందుకే ఇప్పటివరకు కూడా కళ్యాణ్ రామ్ కానీ ఎన్టీఆర్ కానీ చంద్రబాబుతో మాట్లాడరు అని ఆమె తెలిపింది. అదేవిధంగా ఉమామహేశ్వరి మరణం పై సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఉమామహేశ్వరి కచ్చితంగా ఒక లేఖ రాసి ఉంటుంది, ఆ లేఖను చంద్రబాబు మాయం చేసి ఉంటారు అని లక్ష్మీపార్వతి ఆరోపించింది. అంతేకాకుండా ఉమామహేశ్వరి సూసైడ్ చేసుకోవడానికి గల అసలు కారణం ఏంటో తేల్చాలని లక్ష్మీపార్వతి వెల్లడించింది. అయితే ఉమామహేశ్వరి ఆస్తివాదాల వల్లే ఆత్మహత్య చేసుకుంది అని ఆమెకు అనిపిస్తుందట. అంతేకాకుండా నారా లోకేష్ ని అందలం ఎక్కించడానికి చంద్రబాబు నాయుడు ఎలాంటి పని అయినా చేస్తాడని, ఒకవేళ ఉమామహేశ్వరి విషయంలో అటువంటి పని నువ్వు చేయకపోతే కుటుంబ పెద్దవి కదా ఆ సమస్యను పరిష్కరించలేవా అని చంద్రబాబును ప్రశ్నించింది లక్ష్మీపార్వతి. ఇప్పటికైనా టిడిపి పార్టీని బాలకృష్ణకు ఇచ్చేస నువ్వు పక్కకు తప్పుకో అంటూ చంద్రబాబుపై ఘాటుగా విమర్శలు చేసింది లక్ష్మీపార్వతి.