lion hunting video viral
lion hunting video viral

Viral Video : మనిషి అయినా జంతువైనా.. ఎవరైనా సరే.. బతకాలంటే తిండి కావాలి. తిండి ఊరికే రాదు కదా. ఇంట్లో కూర్చుంటే తిండి వస్తుందా? బయటికెళ్లాలి. పని చేయాలి. నాలుగు రాళ్లు సంపాదిస్తేనే రోజూ మూడు పూటలా తిండి వస్తుంది. లేదంటే.. పస్తులుండాల్సిందే. మనుషులైతే డబ్బు సంపాదించి ఆ తర్వాత అన్నీ కొనుక్కొని వండుకొని తింటారు. కానీ.. జంతువులకు ఈ డబ్బులు గిబ్బులు తెలివవు. ఆకలయిందా? వేటాడాల్సిందే. అంతే.. వేటాడి.. తమకు నచ్చిన ఆహారాన్ని తినేస్తాయి. మళ్లీ ఆకలేసేవరకు వేట జోలికి వెళ్లవు. అయితే.. అడవికి రాజు సింహం అయినా.. పులి అయినా.. ఇంకేదైనా ఆకలయితే వేటాడాల్సిందే. తనకు ఆహారాన్ని తీసుకొచ్చి ఎవ్వరూ ఇవ్వరు.

lion hunting video viral
lion hunting video viral

అడవులలో ఎక్కువ బలం ఉన్నవి సింహాలు, పులులు. వాటికి ఎంత బలం ఉన్నా సరే.. తమకు నచ్చిన ఆహారం దొరకాలంటే మాత్రం కష్టపడాల్సిందే. ఇప్పుడు మనం చూడబోయే వీడియో కూడా అటువంటిదే. ఒక సింహానికి అడవి పంది కనిపించింది. సింహాన్ని చూసి.. అది బురదలోపలికి వెళ్లి దాక్కుంది. అడవి పందులు ఎక్కువగా బురదల్లోనే దాక్కుంటాయి కదా. ఆ సింహానికి ఆకలేసింది. ఇక ఊరుకుంటుందా? అది ఎంత లోపల బురదలో దాక్కున్నా కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సింహం చేసిన పోరాటం మామూల్ది కాదు. దాని కోసం పెద్ద గొయ్యినే తవ్వింది ఆ సింహం.

Viral Video : చివరకు అడవి పందిని పట్టేసుకున్న సింహం

ఒంటికి బురద అంటుకున్నా కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా.. బురదను అంతా తవ్వేసి.. చివరకు అడవి పందిని పట్టేసుకుంది ఆ సింహం. ఏది ఏమైనా.. సింహానికి కూడా ఆహారం దొరకాలంటే.. కష్టపడాల్సిందే కదా. వేటాడాల్సిందే కదా. ఈ వీడియో చూస్తే అదే అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సింహం వేటను చూసి నెటిజన్లు తెగ ముచ్చట పడుతున్నారు. ఎంతైనా సింహం సింహమే.. దాని రాజసమే వేరు.. అంటూ సింహాన్ని తెగ పొడిగేస్తున్నారు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూలై 6, 2021 at 1:24 సా.