lord ganesha canvas in padday farm in pune
lord ganesha canvas in padday farm in pune

Viral Video : అమేజింగ్.. జింగ్ జింగ్.. అంటూ ఓ సినిమాలో డైలాగ్ ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియో చూస్తే మీరు కూడా అదే అంటారు. వావ్.. అమేజింగ్.. జింగ్.. జింగ్ అనాల్సిందే. సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అయిపోతోంది. ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిందంటే.. దాంట్లో ఏదో స్పెషల్ ఉండాలి. అవును.. ఇప్పుడు మీరు చూడబోయే వీడియోలో కూడా ఓ స్పెషాలిటీ దాగి ఉంది. ఆ వీడియో చూస్తే మీరు నోరెళ్లబెట్టడం తప్పించి ఇంకేం చేయలేరు. ఇంతకీ ఏంటా వీడియో అంటారా? అక్కడికే వస్తున్నా.. ఆగండి.

lord ganesha canvas in padday farm in pune
lord ganesha canvas in padday farm in pune

సాధారణంగా పంట పొలాల్లో ధాన్యం, ఇతర పప్పుధాన్యాలు, అవీ ఇవీ పండిస్తారు. ప్రస్తుతం నేటి జనరేషన్ లో యూత్ కూడా ఎక్కువగా వ్యవసాయం వైపు మొగ్గు చూపుతోంది. దానికి కారణం.. వ్యవసాయంలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులే. చాలామంది తమ ఉద్యోగాలను మానేసి మరీ వ్యవసాయంలోకి దిగుతున్నారు. దాని వల్ల.. వ్యవసాయానికి ప్రస్తుతం డిమాండ్ పెరుగుతోంది.

Viral Video : రైతుగా మారిన ఇంజినీర్ ఆలోచనే ఇది

మహారాష్ట్రలోని పూణేకు చెందిన శ్రీకాంత్ అనే ఓ ఇంజినీర్ కూడా తన ఉద్యోగాన్ని మానేసి.. ఇంటికి వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నాడు. అయితే.. ఆయన ఏదో ఊరికే వ్యవసాయం చేస్తే ఏముంటుంది కిక్కు అని అనుకున్నాడో ఏమో కానీ.. తన పంట పొలాన్ని చూసేందుకు జనం ఎగబడేలా చేశాడు. జపాన్ కు చెందిన ఓ ఆర్ట్ ను ఉపయోగించి.. తన పంట పొలంలో గణేశ్ ఆర్ట్ ను వేయించాడు. దాన్ని ఆకాశం నుంచి చూస్తేనే వినాయకుడి ప్రతిమ కనిపిస్తుంది. మూడు నాలుగు ఎకరాల్లో పేద్ద గణేశుడి ఆర్ట్ ను వేయించి.. డ్రోన్ ద్వారా వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. గణేశ్ ఆర్ట్ సూపర్ అంటూ నెటిజన్లు.. శ్రీకాంత్ ను పొగడకుండా ఉండలేకపోతున్నారు. ఏది ఏమైనా.. శ్రీకాంత్ తన సరికొత్త ఆలోచనలతో.. అక్కడ తెగ పాపులర్ అయిపోయాడు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 27, 2021 at 11:18 ఉద.