Love Birds : సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు హీరో మరియు హీరోయిన్ల మధ్య లవ్ ఎఫైర్లు మరియు గాసిప్స్ వినిపించడం కొత్తేమీ కాదు. దీంతో అప్పుడప్పుడు ఇలాంటి వార్తలలో కొంతమేర నిజం ఉన్నప్పటికీ ఎక్కువ శాతం మాత్రం వట్టి పుకార్లే ఉంటాయి. అయితే తాజాగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ హీరో గురించి సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.
పూర్తి వివరాల్లోకి వెళితే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దాదాపుగా 7 సంవత్సరాలుగా నటుడుగా కొనసాగుతున్నాడు ఓ యంగ్ హీరో. అయితే ఇతగాడు ఎప్పటినుంచో ఇండస్ట్రీలో ఉంటున్నప్పటికీ తన చిత్రాలతో పెద్దగా ఆకట్టుకోకపోవడంతో నిన్నమొన్నటివరకూ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేక పోయాడు. కానీ 2 సంవత్సరాల క్రితం ఈ హీరో నటించిన రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి.
దీంతో ఒక్కసారిగా ఈ హీరో కెరియర్ కాస్తా మలుపు తిరిగింది. అంతేకాకుండా ఈ హీరో నటించిన ఓ చిత్రాన్ని ఆ మధ్య బాలీవుడ్ లో కూడా రీమేక్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ హీరోకి టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి బడా దర్శక నిర్మాతలతో పరిచయాలు ఏర్పడి దాదాపుగా మూడు చిత్రాలలో హీరోగా నటిస్తున్నాడు.
అయితే ఇంతకీ విషయం ఏమిటంటే గతంలో ఈ హీరో నటించిన చిత్రంలో ముంబైకి చెందినటువంటి ఓ ప్రముఖ హీరోయిన్ కూడా నటించింది. ఈ చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారని పలు గుసగుసలు వినిపించాయి. కానీ ఎలాంటి సమాచారం లేకపోవడంతో వట్టి రూమర్స్ గా కొట్టిపారేసి నెటిజన్లు కూడా లైట్ తీసుకున్నారు. కానీ ఈ మధ్యకాలంలో ఈ హీరో ఎక్కువగా ముంబై హీరోయిన్ తో కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నాడు. అంతేకాకుండా ఏకంగా తరచుగా ముంబైకి వెళ్లి వస్తున్నట్లు సమాచారం.
కాగా చివరికి ఇటీవలే వీరిద్దరి ప్రేమ వ్యవహారం కుటుంబ సభ్యులు వరకు వెళ్లిందని కానీ ఆ హీరో తల్లిదండ్రులు వీరిద్దరి ప్రేమకి అంగీకారం తెలపని లేదని మరికొందరు చర్చించుకుంటున్నారు. మరి వీరిద్దరి ప్రేమాయణం పెళ్లి వరకు వెళుతుందో లేదో చూడాలి.