M.S.Raju : టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ ప్రొడ్యూసర్‌గా ఓ వెలుగు వెలిగాడు ఎం.ఎస్ రాజు. ఆయన తనయుడు సుమంత్ అశ్విన్ పేరున సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌ని స్థాపించి శత్రువు సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. పరుచూరి బ్రదర్స్ లాంటి అగ్ర రచయితలను తీసుకున్నారు. శత చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ లాంటి వారితో దేవీ పుత్రుడు లాంటి సినిమాలను నిర్మించారు. మనసంతా నువ్వే, నీ స్నేహం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి ప్రేమ కథలను ఒక్కడు, వర్షం, వంటి భారీ బడ్జెట్ సినిమాలను, పౌర్ణమి లాంటి సంగీత ప్రధానమైన చిత్రాలను నిర్మించారు. టాలీవుడ్‌లో ఎం.ఎస్.రాజు అగ్ర నిర్మాతగా చెప్పుకున్నారు.

M.S.Raju a star-producer changed-himself-according-to-trend
M.S.Raju a star-producer changed-himself-according-to-trend

ఆయన సినిమా అంటే ఫ్యామిలీ అంతా చూసేలా ఉంటాయని ..ఆ నిర్మాణ సంస్థ అంటే గట్టి నమ్మకం ఏర్పడ్డాయి. అయితే పౌర్ణమి సినిమా ఫ్లాప్ అయింది. దాంతో ఎం.ఎస్.రాజు ఆర్ధికంగా భారీ నష్టాలను చూడాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయన చేసిన మరో పొరపాటు ఆయనే దర్శకుడిగా మారడం. నిర్మాతగా సక్సెస్ అయిన రాజు గారికి స్క్రీన్ ప్లే మీద మంచి పట్టుకుంది. కథ మీద కూడా బాగా అవగాహన ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళి మిగతా దర్శకులు, నిర్మాతలు సలహాలు తీసుకొనేవారు. ఆయన జడ్జ్‌మెంట్ మీద అపారమైన నమ్మకం ఉన్నవాళ్ళు ఇండస్ట్రీలో ఎంతో మంది ఉన్నారు. కానీ ఆయన దర్శకుడిగా మారి చాలా వరకు అన్నీ రకాలుగా దెబ్బతిన్నారు. కొంతమంది సన్నిహితులు కూడా రాజుగారిని నిర్మాణంలోనే ఉండమని సలహాలిచ్చారు. కానీ ఆయన గట్టి నమ్మకంతో వాన సినిమా తీసి దెబ్బ తిన్నారు.

M.S.Raju : ‘7 డేస్ 6 నైట్స్’ అనే రొమాంటిక్ సినిమా తీస్తున్నారు.

ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికి రాజుగారికి లాభాలు రాలేదు సరికదా పెట్టిన పెట్టుబడి కూడా రాలేదట. ఆ తర్వాత కొడుకును హీరోగా పెట్టి సినిమా తీశారు. అది కూడా పోయింది. దాంతో మానసికంగా కృంగిపోయారట. మళ్ళీ కాస్త తేరుకొని సినిమాలు చేస్తున్నారు. అది కూడా దర్శకుడిగానే. అయితే గతంలో ఆయన బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలకి పూర్తి భిన్నంగా ఎం.ఎస్.రాజు సినిమాలు తెరకెక్కిస్తున్నారు. చాలా మందికి ఇది డైజెస్ట్ కావడం లేదట. కానీ ప్రస్తుతం డిజిటల్ వరల్డ్ ఊపుమీదుంది. యూత్‌ని అట్రాక్ట్ చేసే సినిమాలే ఎక్కువగా వస్తున్నాయి. అందులోను బోల్డ్ కంటెంట్ సినిమాలైతే ఆదరణ ఎక్కువగా ఉంటోంది. అదే దారిలో రాజు గారి సినిమాలు ఉంటున్నాయి. ఇప్పటికే ‘డర్టీహరి’ అనే సినిమా తీశారు. దీనివల్ల ఆయనకి పెద్దగా ఒరిగిందేమి లేదు. ఇప్పుడు ఆయన కొడుకు నిర్మాతగా ‘7 డేస్ 6 నైట్స్’ అనే రొమాంటిక్ సినిమా తీస్తున్నారు. మరి రాజుగారి నుంచి మళ్ళీ ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ లాంటి సినిమాలు ఎప్పుడొస్తాయో.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 30, 2021 at 2:05 సా.