Madhavi Latha: టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటి మాధవి లత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈమె నటిగా కంటే వ్యక్తిగతంగా బాగా హాట్ టాపిక్ గా నిలిచింది. చిన్న చిన్న పాత్రలతో వెండితెరపై అడుగుపెట్టి.. ఆ తర్వాత హీరోయిన్ గా పరిచయం అయింది. కానీ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలువలేకపోయింది.
తొలిసారిగా 2008లో నచ్చావులే సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత స్నేహితుడా సినిమాలో నటించింది. కానీ ఎందుకో తను ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. పైగా తాను కథ ఎంచుకోవడంలో పొరపాటు చేయడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకోలేక పోయింది.
ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నా కూడా సోషల్ మీడియా వేదికగా తెలుగు ప్రేక్షకులకు టచ్ లో ఉంటుంది. నిత్యం తన సోషల్ మీడియా వేదికగా ఏదో ఒక పోస్టు తో బాగా హాట్ టాపిక్ గా మారుతుంది. ఆ పోస్టులకు నెగిటివ్ కామెంట్స్ కూడా ఎదుర్కొంటుంది. పైగా తాను కూడా అవతలి వారి పై బాగా ఫైర్ అవుతుంటుంది.
ఇదిలా ఉంటే మాధవి లత ఓ దర్శకుడి తీరు వల్ల చాలా ఇబ్బంది ఎదురుకుందట. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరో కాదు.. నచ్చావులే సినిమాని తెరకెక్కించిన రవి బాబు. ఆయన నటుడు కూడా. ఇక మాధవి లత డైరెక్టర్ చెప్పినట్టుగా వినని కారణాల వల్ల కొన్ని సార్లు బూతులు కూడా తినాల్సి వచ్చిందట. ఇక కొన్నిసార్లు చెట్ల కింద కూర్చోబెట్టి అవమానించారని..
ఇదంతా ఆయన చెప్పినట్టు వినకపోవడం వల్లనే అని అన్నది. తెలుగు అమ్మాయి ఎక్స్పోజింగ్ చేయాలి అంటూ ఉంటారు.. నేను స్నేహితుడి సినిమాలో చేసింది ఏంటి.. ఎక్స్పోజింగ్ కాదా.. అది గ్లామర్ రోల్ కాదా.. కథకు తగ్గట్టుగా తెలుగు అమ్మాయిలు నటించడానికి సిద్ధంగానే ఉంటారు అని తెలిపింది. కానీ వాళ్లకు ఇంకేదో కావాలి అంటూ..
Madhavi Latha: వారి కోరికలను చూసి నోట మాట రావడం లేదన్న మాధవి లత..
అది అమ్మాయిలు మనసులు చంపుకొని ఇవ్వలేరని.. అందుకే తన లాంటి చాలామంది అమ్మాయిలు ఎన్నో ఆశలు పెట్టుకొని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కూడా.. ఇక్కడ మనుషుల వారి కోరికలను చూసి నోట మాట రావడం లేదని తెలిపింది. అంతేకాకుండా తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇస్తే మాకేంటి లాభం అన్నట్లు మాట్లాడతారు అని.. ఇక అప్పుడే ఆ విషయం అర్థం చేసుకోవాలి అని.. అలాగైతే వారిని నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు అని లేదంటే తొక్కేస్తారు అని తెలిపింది.