Mahesh babu : మహేష్ బాబు నటించబోయో 28వ సినిమాకి సంబంధించిన తాజా ప్రకటన వెలువడింది. గత కొన్ని రోజులుగా మహేష్ బాబు నటించబోయో తర్వాత ప్రాజెక్ట్ మీద బోలెడంత సస్పెన్స్ నెలకొన్న సంగతి తెలిసిందే. సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. పరశురాం పెట్లా దర్శకత్వం వహిస్తున్నాడు. దుబాయ్‌లో నెలరోజుల షెడ్యూల్ పూర్తి చేసిన సర్కారు వారి పాట బృందం ఈ నెల ఉగాది రోజున హైదరాబాద్‌లో సెకెండ్ షెడ్యూల్ 25 రోజులు ప్లాన్ చేశారు. కానీ చిత్ర బృందంలో కొంతమందికి కరోనా రావడంతో తాత్కాలికంగా నిలిపివేశారు.

mahesh babu 28 official update... double damaka in 2022
mahesh babu 28 official update… double damaka in 2022

అయితే సర్కారు వారి పాట తర్వాత మహేష్ బాబు నటించాల్సిన సినిమా రాజమౌళి దర్శకత్వంలో. శ్రీదుర్గ ఆర్ట్స్ బ్యానర్‌పై డా.కె.ఎల్.నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నట్టు కూడా వెల్లడించారు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ అండ్ పోస్ట్‌ప్రొడక్షన్స్ వర్క్ ఇంకా పూర్తి కాకపోవడంతో ఈ ఏడాదిలో మహేష్ – రాజమౌళి ప్రాజెక్ట్ మొదలవడం సాధ్యమవదని ..మహేష్ మరో సినిమా చేసేందుకు నిర్ణయించుకున్నాడు. ఇదే విషయం గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

Mahesh babu : మహేష్ బాబు 28, సర్కారు వారి పాట 2022 లో ..!

ఈ క్రమంలోనే మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ నెక్స్ట్ ఉంటుందన్న వార్తలు వచ్చి నిజమయ్యాయి. తాజాగా ఈ సినిమా అధికారక ప్రకటన వచ్చింది. శ్రీమతి మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) నిర్మాణంలో మహేష్ 28 తెరకెక్కబోతోంది. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకి రాబోతోంది. అంతేకాదు సర్కారు వారి పాట తర్వాత మహేష్ 28.. 2022 లో సమ్మర్ కానుకగా రాబోతుందని తాజాగా ప్రకటనలో మేకర్స్ ప్రకటించారు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on మే 1, 2021 at 10:10 సా.