Mahesh babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పరశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న భారీ కుంభకోణాల నేపథ్యంలో తెరకెక్కుతోంది. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాని 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి మహేష్ సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నారు. ఈ నెల 31న సర్కారు వారి పాట సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ గాని మహేష్ ఫస్ట్ లుక్ గానీ రానుంది.

mahesh-babu as a cricket coach...movie in sharooq range

ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు త్రివిక్రం శ్రీనివాస్‌తో ఒక సినిమా చేయబోతున్నాడు. అలాగే రాజమౌళి దర్శకత్వంలో ఓ పాన్ ఇండియన్ సినిమా కమిటయ్యాడు. అయితే రాజమౌళి ప్రాజెక్ట్ మొదలవడానికి కనీసం ఏడాది పైనే సమయం పడుతుంది. అందుకే త్రివిక్రం శ్రీనివాస్ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రీసెంట్‌గా ఈ విషయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి స్వయంగా వెల్లడించాడు.

Mahesh babu : మహేష్ బాబు క్రేజ్‌ను దృష్ఠిలో పెట్టుకొని అనిల్ రావిపూడి పాన్ ఇండియన్ స్థాయి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడట.

దాంతో ఈ సినిమా జోనర్ గురించి అందరిలో చర్చలు మొదలయ్యాయి. అయితే తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్‌లో స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన చెక్ దే ఇండియా రేంజ్‌ను మించి అనిల్ రావిపూడి కథ సిద్దం చేస్తున్నట్టు తెలుస్తోంది. క్రికెట్ కోచ్‌గా మహేష్ బాబును అనిల్ రావిపూడి చూపించబోతున్నాడని సమాచారం. మహేష్ బాబు కి ప్రస్తుతం ఉన్న పాన్ ఇండియన్ క్రేజ్‌ను దృష్ఠిలో పెట్టుకొని అనిల్ రావిపూడి పాన్ ఇండియన్ స్థాయి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడట.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on మే 10, 2021 at 9:00 సా.