Mahesh Babu: మహేశ్ తండ్రిగా బాలీవుడ్ స్టార్ ఒప్పుకున్నడా..నిజం కాదే.?

G K

Mahesh Babu: సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇప్పుడు ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. దీనికి కారణం ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకొని రిలీజ్‌కు రెడీ అవుతోంది. కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు దర్శకుడు పరశురాం పెట్లా. ప్రముఖ నిర్మాణ సంస్థలైన మైత్రీ మూవి మేకర్స్, 14 రీల్స్ ప్లస్ వారితో కలిసి మహేశ్ బాబు నిర్మిస్తున్నాడు. ఇప్పటికే చిత్రబృందం మే 12న భారీ స్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేస్తామని అధికారికంగా కూడా ప్రకటించారు.

అయితే, సర్కారు వారి పాట సినిమా తర్వాత మహేశ్ బాబు – త్రివిక్రం శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ సినిమాను మొదలుపెట్టబోతున్నారు. జూన్ నుంచి ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకువచ్చేందుకు షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో మహేశ్ బాబు సరసన హీరోయిన్‌గా పూజా హెగ్డే ఫిక్సైంది. ఈ క్రమంలోనే మహేశ్ బాబుకు తండ్రిగా ఓ బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోను ఎంపిక చేసినట్టు తాజా సమాచారం. ఆయనెవరో కాదు అనీల్ కపూర్. బాలీవుడ్‌లో మీసకట్టు ఉన్న ఒకే ఒక్క హీరోగా అనీల్ కపూర్‌కు టాలీవుడ్ ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది.

Mahesh Babu: అనీల్ కపూర్ టాలీవుడ్ రీ ఎంట్రీ అదిరిపోతుంది.

1990లలో అనీల్ కపూర్ బాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగారు. ఆ తర్వాత కీలకమైన పాత్రలను పోషిస్తూ కొనసాగుతున్నారు. గతంలో అనీల్ కపూర్ ఒకే ఒక్క తెలుగు సినిమాలో నటించారు. ఆ తర్వాత మళ్ళీ ఇంతకాలానికి మహేశ్ బాబు సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అది కూడా మహేశ్ తండ్రి పాత్రకు. ఇదే నిజమైతే అనీల్ కపూర్ టాలీవుడ్ రీ ఎంట్రీ అదిరిపోతుంది. అంతేకాదు, మహేశ్ బాబు – అనీల్ కపూర్‌లను సిల్వర్ స్క్రీన్ మీద చూస్తుంటే ఆ థ్రిల్ మాటల్లో చెప్పలేము. చూడాలి మరి దీనికి సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఎప్పుడొస్తుందో.

- Advertisement -