Mahesh babu : సూపర్ స్టార్ మహేష్ బాబు .. తన తండ్రి మొహమాటం వల్ల చాలా వరకు నష్టపోయారని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణకి ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్ లాంటి దిగ్గజ నటులున్నా కూడా కృష్ణ డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా ఇండస్ట్రీని ఏలారు. ప్రయోగాలకి కృష్ణ ఎప్పుడూ ముందుండేవారు. సినిమా ఇండస్ట్రీలో నిర్మాతల హీరోగా ఎక్కువ పేరు తెచ్చుకున్న మొదటి హీరో కృష్ణ అని అప్పుడు, ఇప్పుడు వినిపిస్తూనే ఉంటుంది. రోజుకి మూడు షిఫ్టుల్లో పని చేసిన హీరో. ఇలా 10 ఏళ్ళ పాటు నటించారంటే సినిమా పట్ల ఆయనకున్న అంకిత భావం ఎటువంటిదో అందరికీ తెలిసిందే.

ఎవరైనా నిర్మాత వచ్చి “సార్ సినిమా పోయింది..డబ్బు పోయిందండీ”..అంటే చాలు క్షణం ఆలోచించకుండా వెంటనే అదే నిర్మాత ఫ్రీగా సినిమా చేసిన హీరో. ఇలాంటి సందర్భాలు ఆయన జీవీతంలో చాలానే ఉన్నాయి. దాదాపు 350 సినిమాలకి పైగా నటించిన ‘కృష్ణ అల్లూరి సీతారామరాజు’, ‘ఫస్ట్ కౌ బాయ్’ సినిమా, ‘ఫస్ట్ 70 ఎం ఎం’ స్కోప్ సినిమాలను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. సినిమా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా డేర్‌గా తీసుకుంటారు. ఆయన మంచితనం చూసి చాలామంది నాటకాలు ఆడి ఆర్ధికంగా ఆయనని మోసం చేశారట. జనాలను ఊరికే నమ్మేతత్వం ఉండటంతో అడిగిన వాళ్ళకి లేదు..కాదు అనకుండా సహాయం చేసేవారు.
Mahesh babu : ఇండస్ట్రీలో మరీ అతి మంచితనం ఉంటే ఎక్కువసార్లు మోసపోవాల్సి వస్తుంది.
కానీ ఆయన దగ్గర సహాయం తీసుకున్న వాళ్ళు చివరికి ఆయననే మోసం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయట. ఆయన అతి మంచితనం వల్లే ఇలా జరిగిందని ఆయన తనయుడు సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు. ఆయనలా ఉండటం చాలా కష్టమని, అందుకే కాస్త జాగ్రత్తగా అన్నీ విషయాలలో ఉంటానని అన్నాడు మహేష్. ఇండస్ట్రీలో మరీ అతి మంచితనం ఉంటే ఎక్కువసార్లు మోసపోవాల్సి వస్తుందని..తన తండ్రి అలా మోసపోయే ఎన్నో పోగొట్టుకున్నారని మహేష్ తెలిపాడు. ప్రస్తుతం కృష్ణ సినిమాలకి దూరంగా ఉంటూ ఫ్యామిలీతో గడుపుతున్నారు. అయితే ఒక్కసారైనా ఆ సూపర్ స్టార్ ఈ సూపర్ స్టార్ కలిసి బిగ్ స్క్రీన్ మీద కనిపిస్తే చూడాలని కోరుకుంటున్నారు అభిమానులు. ఆ కోరిక సర్కారు వారి పాటతో తీరొచ్చేమో చూద్దాం.