Mahesh – Acharya: 2020లో సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ అందుకుంది. 2020 సంక్రాంతి సీజన్లో అల్లు అర్జున్ హీరోగా నటించిన అల వైకుంఠపురములో సినిమాతో పోటీ పడి మహేశ్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఎంతో ఘనంగా హైదరాబాద్ ఎల్బి స్టేడియంలో నిర్వహించారు. ఆ గ్రాండ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ తర్వాత నుంచి మెగాస్టార్ – సూపర్ స్టార్ కలిసి ఆచార్య సినిమాలో నటించబోతున్నారనే ప్రచారం మొదలైంది.
ఆచార్య ఇప్పుడు రామ్ చరణ్ పోషించిన సిద్ధ పాత్రకు మహేశ్ బాబును అనుకున్నారు కొరటాల. సరిలేరు సక్సెస్ తర్వాత మహేశ్ ఆచార్య సినిమాకు 25 రోజులు మాత్రమే డేట్స్ ఇచ్చినట్టు ఇందులో చిరుతో కలిసి 25 నిమిషాల పాటు స్క్రీన్ మీద కనిపించ బోతున్నట్టు వార్తలు వచ్చాయి. సమ్మర్‌కు వెకేషన్‌కు వెళ్ళి రాగానే మహేశ్ ఆచార్య షూటింగ్లో జాయిన్ కానున్నట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. టాలీవుడ్లో తెరకెక్కనున్న అతిపెద్ద భారీ మల్టీస్టారర్ మెగాస్టార్ – సూపర్ స్టార్ల ఆచార్య అని చెప్పుకున్నారు. ఇక ఈ సినిమాలో మహేశ్ నటించినందుకు గానూ ఏకంగా రూ 40 కోట్ల వరకు రెమ్యునరేషన్ కూడా అందుకోనున్నట్టు ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపించింది.

Mahesh – Acharya: నిజంగా మహేశ్ నటించినా కథలో దమ్ము లేకపోతే ఫ్లాపే కదా అయ్యేది.
అయితే, దీనికి కరోనా బ్రేక్ వేసింది. 2020 మార్చ్ నెలలో కరోనా తాండవించడంతో పాటు ఆ తర్వాత వరుస వేవ్స్ తో ఆచార్య బడ్జెట్ లెక్కలు మారాయి. దాంతో మహేశ్ బదులు చరణ్ వచ్చి చేరాడు. ఫైనల్‌గా నేడు ఆచార్య థియేటర్స్‌లోకి వచ్చి భారీ డిజాస్టర్ అందుకుంది. ఇది అసలు చిరంజీవి సినిమానా, రామ్ చరణ్ సినిమానా..లేక మెగా మల్టీస్టారరా..? అనే విషయం ఎవరికీ అర్థం కావడం లేదు. దాంతో ఇప్పుడు సూపర్ స్టార్ మహేశ్ ఫ్యాన్స్..అమ్మో మా మహేశ్ భారీ ఫ్లాప్ నుంచి తప్పించు కున్నాడని చెప్పుకుంటున్నారు. నిజంగా మహేశ్ నటించినా కథలో దమ్ము లేకపోతే ఫ్లాపే కదా అయ్యేది.