Vijay Babu: అవకాశాల పేరుతో అమ్మాయిలను ఘోరంగా వాడుకుంటున్న యంగ్ హీరో.. రేప్ కేసు నమోదు?

Akashavani

Vijay Babu: దేశంలో మహిళల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు తీసుకువచ్చినప్పటికీ మహిళలపై జరుగుతున్న దాడులు మాత్రం ఆగడం లేదు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు నిత్యం ఏదో ఒక చోట మహిళలపై ఈ విధమైనటువంటి అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఇలాంటి అత్యాచార ఘటనలో భాగంగా సినీ పరిశ్రమకు చెందిన హీరో కమ్ ప్రొడ్యూసర్ ఈ విధమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఈ విషయం బయటపడటంతో పెద్దఎత్తున ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మలయాళ ఇండస్ట్రీలో ప్రముఖ వ్యాపారవేత్తగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న విజయ్ బాబుకు నటనపై ఆసక్తి ఉండడంతో ఇండస్ట్రీలోకి ఎంటర్ అయి ఫ్రైడే ఫిలిం హౌస్ అనే ఒక నిర్మాణ సంస్థను స్థాపించారు. ఈ నిర్మాణ సంస్థలో భాగంగా మొట్టమొదటిసారిగా ఫిలిప్స్ అండ్ ది మంకీ పెన్ అనే సినిమాలో నటించడం కాకుండా తానే నిర్మించారు.ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న విజయ్ ఈ సినిమాకి ఎన్నో అవార్డులను కూడా అందుకున్నారు. ఈ విధంగా విభిన్న కథాంశాలతో తెరకెక్కే సినిమాలను నిర్మిస్తూ నిర్మాతగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న విజయ్ చివరిగా సూఫియుమ్ సుజాతయుమ్ అనే సినిమా అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రసారమైంది.

Vijay Babu: అవకాశాల పేరుతో అత్యాచారం….

ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ఈ హీరో అవకాశాల పేరుతో అమ్మాయిలను దారుణంగా వాడుకొని వారిని వదిలేస్తున్నారు అంటూ నిర్మాతపై కోజికోడ్ లో ఉండే ఒక ఎర్నాకులం సౌత్ పోలీసులు కేసు నమోదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇతని పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఫిర్యాదులో భాగంగా విజయ్ బాబు తనకు సినిమా అవకాశాలను ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి నుంచి ఎర్నాకులంలో ఉన్నటువంటి తన ఫ్లాట్ లో ఎన్నోసార్లు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆ యువతి ఫిర్యాదులో పేర్కొంది.ఈనెల 22వ తేదీన ఆ యువతి విజయబాబు పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఇప్పటి వరకు ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నప్పటికీ ఆయనని ఏమాత్రం విచారించలేదు.

- Advertisement -