Manchu Manoj: ఇండస్ట్రీలో గొప్ప నటుడిగా గుర్తింపు పొందిన మంచి మోహన్ బాబు కుమారులు మంచు మనోజ్ మంచు, మంచు విష్ణు మధ్య గత కొంతకాలంగా వివాదాలు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన మంచు మనోజ్ వివాహానికి కూడా విష్ణు అతిధి లాగా వచ్చి వెళ్లిపోయాడు. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. తాజాగా మనోజ్ అనుచరుల మీద మంచు విష్ణు దాడి చేశాడు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో మంచు మనోజ్ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఇంతకాలం రహస్యంగా ఉన్న అన్నదమ్ముల వివాదాలే ప్రస్తుతం బట్టబయలు అయ్యాయి.
మంచు మనోజ్ షేర్ చేసిన వీడియో ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక మంచు విష్ణు ఈ వివాదంపై స్పందిస్తూ ఇది చిన్న విషయం అని.. వీడియో షేర్ చేయటం వల్ల అందరూ దీన్ని పెద్ద వివాదంగా మారుస్తున్నారని చెప్పుకొచ్చాడు. మరొకవైపు మోహన్ బాబు కూడా ఈ వివాదంపై స్పందించి అన్నదమ్ముల మధ్య రాజీ కుదిరిచ్చే వీడియో డిలీట్ చేపించినట్లు తెలుస్తోంది. అలాగే మోహన్ బాబు సతీమణి నిర్మల కూడా స్పందిస్తూ తన కొడుకుల మధ్య ఎటువంటి విభేదాలు లేవని చెప్పుకొచ్చింది. ఇలా ఇప్పటికే మంచు కుటుంబ సభ్యులందరూ ఈ వివాదంపై స్పందించారు. ఇక తాజాగా ఈ వివాదం తర్వాత మంచు మనోజ్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేశాడు .
Manchu Manoj: ఇది ఫ్రాంక్ కాదు కదా…
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తండ్రి సుబ్రహ్మణ్యం ఇటీవల మరణించాడు. ఈ సందర్భంగా మనోజ్ స్పందిస్తూ… ” మణి గారి మరణ వార్త చాలా బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. అజిత్ కుటుంబానికి ఇదే నా ప్రగాఢ సానుభూతి” అంటూ అంటూ సంతాపం తెలియజేస్తూ ట్వీట్ చేశాడు. అయితే మనోజ్ ఇలా ట్వీట్ చేసినప్పటికీ అభిమానులు మాత్రం మంచు మనోజ్, విష్ణు మధ్య జరిగిన గొడవ గురించి ప్రశ్నిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇద్దరి మధ్య గొడవ సర్దుమనిగిందా? ఒకవేళ ఇది ప్రాంక్ కాదు కదా? అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం ఇద్దరి మధ్య గొడవ జరిగినా కూడా మళ్లీ కలిసిపోండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.