Manchu Manoj -Vishnu: ఇటీవల మంచు కుటుంబంలో జరుగుతున్న గొడవలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. మంచు విష్ణు, మనోజ్ మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇటీవల మనోజ్ అనుచరుల మీద విష్ణు దాడి చేసినట్లు ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీంతో మంచు కుటుంబంలో జరుగుతున్న గొడవలు గురించి వివిధ రకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మనోజ్ మౌనిక రెడ్డిని వివాహం చేసుకోవడం విష్ణుకు ఇష్టం లేకపోవడం వల్ల ఈ గొడవలు అన్నీ జరుగుతున్నాయని అందరూ భావించారు. అయితే ఈ గొడవలు మొత్తం నిజం కాదని ప్రాంక్ అయి ఉండవచ్చని కొందరు వెల్లడించారు.
అయితే ఎక్కువ శాతం మంది నిజంగానే వారి మధ్య గొడవలు జరుగుతున్నాయని భావించారు. అయితే ఇక తాజాగా ఈ విషయం మీద మంచు విష్ణు క్లారిటీ ఇచ్చేశాడు. సోషల్ మీడియా వేదికగా విష్ణు షేర్ చేసిన వీడియో చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇంతకాలం వారి మధ్య నిజంగానే గొడవలు జరుగుతున్నాయని భావించిన వారందరూ పూల్స్ అయ్యారు. అసలు విషయం ఏమిటంటే.. ‘ హౌస్ ఆఫ్ మంచుస్ ‘ పేరుతో మంచు వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఒక రియాలిటీ షో చేస్తున్నారు. తాజాగా ఈ రియాలిటీ షో కి సంబందించిన టీజర్ ని విష్ణు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘ హౌస్ ఆఫ్ మంచుస్ ‘ పేరుతో రియాలిటీ షో చేస్తున్నట్లు తెలిపాడు.
Manchu Manoj -Vishnu: అందరిని ఫూల్స్ ను చేసిన మంచు బ్రదర్స్
ఈ టీజర్ లో విష్ణు తాను మంచు మోహన్ బాబు కుమారుడిని అని చెబుతూ మనోజ్ తో గొడవపడిన విజువల్ తో పాటు పలు మీడియా ఛానల్స్ లో వచ్చిన కథనాల క్లిప్పింగ్స్ సైతం ప్రసారం చేశారు. ఇక టీజర్ చివరిలో ఇండియాలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షో అంటూ పేర్కొంటూ హౌస్ ఆఫ్ మంచుస్ పేరుతో ఈ రియాలిటీ షో వస్తుందని ప్రకటించారు. దీంతో మనోజ్, విష్ణు మధ్య ఏదో గొడవ జరిగిందని భావించిన అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. నిజానికి ఆ గొడవలు ప్రాంక్ అయి ఉండవచ్చునని కొందరు భావించారు. మొత్తానికి అన్నదమ్ములిద్దరూ కలిసి విడిపోయినట్లుగా అందరిని భలే బకరాలను చేశారు.