Manchu Manoj: మంచు ఫ్యామిలీలో గత కొద్దిరోజులుగా వివాదాలు చోటు చేసుకున్నాయని వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి విభేదాలు ఒక్కసారిగా రోడ్డున పడ్డాయి.మంచు కుటుంబంతో ఎంతో సన్నిహితంగా ఉన్నటువంటి సారధి అనే వ్యక్తి గత కొద్ది కాలంగా విష్ణు దగ్గరే ఉండేవారు అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి ఈయన విష్ణుకు దూరంగా ఉంటూ మనోజ్ కి దగ్గరయ్యారు. అయితే వీరి మధ్య ఎలాంటి గొడవ చోటు చేసుకుందో తెలియదు కానీ మనోజ్ సారథి ఇంటిలో ఉండగా విష్ణు ఏకంగా సారధి ఇంటికి వెళ్లి సారధి పై దాడి చేయడమే కాకుండా మనోజ్ ని కూడా కొట్టబోయారు.
విష్ణు సారధి పై తీవ్రంగా దాడి చేయడంతో ఆయన తన ఇంటి నుంచి పారిపోతు బయట తలుపుకు గడియ పెట్టి వెళ్లారు. అనంతరం ఇంట్లో విష్ణు మనోజ్ పై దాడి చేయడానికి ప్రయత్నించగా సారథి కుటుంబ సభ్యులు విష్ణుని అడ్డుకున్నారు. అయితే ఈ గొడవకు సంబంధించిన సంఘటనను మనోజ్ వీడియోగా చిత్రీకరించారు. ఈ వీడియోలో వాడేదో అన్నాడుగా రమ్మను అంటూ విష్ణు ఆవేశంగా ఉండగా మనోజ్ మాత్రం ఇలా మా బంధువుల ఇళ్లకు కూడా వచ్చి కొడుతుంటారండి ఇది సిచువేషన్ అంటూ మనోజ్ ఒక వీడియోని ఫేస్ బుక్ ద్వారా షేర్ చేశారు. అయితే కొంతసేపటికి ఈ వీడియోని డిలీట్ చేశారు.
ఇద్దరి మధ్య వివాదాలకు కారణం ఏంటి…
అయితే అప్పటికే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి గొడవలు బయటపడ్డాయి. అయితే వీరిద్దరి విషయంలో ఎందుకు గొడవలు చోటు చేసుకున్నాయనే విషయం మాత్రం తెలియలేదు. ఇకపోతే గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఇద్దరు మధ్య గొడవలు చోటు చేసుకుంటున్నాయని తెలుస్తుంది. ఇక తాజాగా మనోజ్ రెండో పెళ్లి చేసుకున్నప్పుడు కూడా విష్ణు దంపతులు కేవలం అతిథులుగా వచ్చి వెళ్లిపోయారు. ఇక మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా కూడా వీరిద్దరి మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు బయటపడ్డాయి. ఈ పుట్టినరోజు వేడుకలలో పాల్గొనగా విష్ణు మాత్రం ఈ వేడుకలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం విష్ణు మనోజ్ మధ్య చోటు చేసుకున్న ఈ గొడవ గురించి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.