Rajasthan : ఈ మధ్యకాలంలో కొందరు వివాహేతర సంబంధాల మోజులో పడి కట్టుకున్న వాళ్లను సైతం కడితేర్చడానికి ఏమాత్రం వెనకాడటం లేదు. అంతేకాకుండా మరికొందరైతే ఏకంగా కట్టుకున్న వాళ్ళని అవిటి వాళ్ళను చేసి ఎలాగైనా విడాకులు తీసుకొని ఇతరులతో సెటిల్ అయిపోవచ్చని కూడా ఆలోచిస్తూ తీరని మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా వివాహిత తన భర్తను నపుంసకుడిగా మారిస్తే హ్యాపీగా తన ప్రియుడితో సెటిల్ అయిపోవచ్చని భావించి ఏకంగా కట్టుకున్న భర్తను సైతం కడతేర్చటానికి ఒడిగట్టిన ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని బార్మర్ జిల్లా పరిసర ప్రాంతంలో కనుదేవి అనే వివాహిత తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటుంది. అయితే కనుదేవి భర్త కుటుంబ పోషణ నిమిత్తమై డ్రైవర్ గా ఉద్యోగం చేసేవాడు. కానీ వీరి కుటుంబం అప్పటికే మంచి ఆస్తిపాస్తులతో సెటిల్ అవడంతో కనుదేవికి ఇష్టం లేకపోయినప్పటికీ తన భర్తతో పెళ్లికి ఒప్పుకుంది. అయితే పెళ్లయి కనీసం పట్టుమని పది నెలలు కూడా కాకుండా కనుదేవి మాత్రం తన భర్తని వదిలించుకుంటే తన ప్రియుడితో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చని అనుకుంది. ఈ క్రమంలో తన ప్రియుడు భర్తను వదిలించుకుంటే ఆస్తిపాస్తులు రావని కాబట్టి కానీ తనంతట తానే విడాకులు ఇచ్చే విధంగా చేస్తే ఆస్తిలో వాటా దక్కుతుందని పన్నాగం పండింది.
ఈ క్రమంలో తన భర్త మర్మంగాన్ని కోసేసి నపంసుకుని చేయాలని ప్లాన్ చేసింది. అయితే ఈ ప్లాన్ లో భాగంగా అందరూ పడుకున్న తర్వాత బ్లేడ్ తీసుకొని తన భర్త పై దాడి చేసింది. దీంతో వెంటనే బాధితుడు కేకలు వేయడంతో చుట్టుప్రక్కల వాళ్ళు వచ్చి బాధితుడిని కాపాడారు. అలాగే హాస్పిటల్లో చేర్పించి ట్రీట్మెంట్ చేయించారు.
ఇక కనుదేవి వ్యవహారంపై విచారించిన పోలీసులు ఆమె పన్నాగాన్ని పసిగట్టి కటకటాల్లోకి నెట్టారు. అయితే బాధితుడు తల్లిదండ్రులు మాత్రం కనుదేవి చేసిన ఈ అఘాయిత్యం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తమ కుటుంబాన్ని బాగా చూసుకుంటుందని ఆశించిన తమకి కనుదేవి తీరు తీవ్ర బాధని కలిగించిందని వాపోతున్నారు. అలాగే తమ కూతురికి అంతకుముందే ప్రియుడు ఉన్న సంగతిని దాచిపెట్టి పెళ్లి చేసినందుకు ఆమె తల్లిదండ్రులను కూడా శిక్షించాలని పోలీసులను కోరుతున్నారు.