Married: ఈ మధ్యకాలంలో కొందరు కష్టపడకుండా చాలా సులభంగా డబ్బు సంపాదించాలని అడ్డదారులు తొక్కుతున్నారు. ఈ క్రమంలో ఆన్లైన్లో వ్యభిచారం అలాగే ఆర్థిక మోసాలు వంటి వాటిని ఆసరాగా చేసుకొని అందినకాడికి దోచుకుంటున్నారు. అయితే తాజాగా ఓ మహిళ ఆన్లైన్ లో వ్యభిచారం నిర్వహిస్తూ తన భర్త కంటపడింది చివరికి బుద్ధి చెప్పాల్సిన భర్త తన భార్యతో నీచపు పనులు చేయించిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని ఇండోర్ పట్టణ పరిసర ప్రాంతంలో ఓ వివాహిత తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటుంది.
అయితే ఈ వివాహితకి పెళ్లయి 15 సంవత్సరాల అయినప్పటికీ సంతానం కలగలేదు. దీంతో తన భర్త పైన అనుమానం పెంచుకొని పడక సుఖం కోసం పక్కదారులు పట్టింది. ఈ క్రమంలో సోషల్ మీడియా మాధ్యమాలను ఆసరాగా చేసుకుని యువకులతో మాయమాటలు చెబుతూ ముగ్గులోకి దింపేది. దీంతో వివాహిత మోజులో పడ్డటువంటి కొందరు యువకులు ఆమెతో తమ కామ కోరికలు తీర్చుకొని పెద్ద మొత్తంలో డబ్బు కూడా సహాయం చేసే వాళ్ళు. చివరికి ఈ విషయం ఈ నోటా ఆ నోటా పాకుతో వివాహిత భర్త చెవిన పడింది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఇంతకీ ఆ ట్విస్ట్ ఏమిటంటే తన భార్య డబ్బుకోసం అలాగే తన లైంగిక సుఖం కోసం నీచపు పనులు చేస్తుందని తెలుసుకున్న భర్త ఆమెను మందలించాల్సింది పోయి వ్యభిచారాన్ని వృత్తిగా చేసుకొని డబ్బులు సంపాదించమని ప్రోత్సహించాడు. ఈ క్రమంలో ఏకంగా తన స్నేహితులకు కూడా తన భార్యని పరిచయం చేస్తూ పడక సుఖాన్ని పంచి డబ్బులు సంపాదించాలని తన భార్యపై ఒత్తిడి తెచ్చాడు.
అయితే ఇన్ని రోజులు గుట్టుగా సాగుతున్న వివాహిత వ్యవహారం ఒక్కసారిగా తన భర్తకి తెలియడం, అలాగే డబ్బు మీద మోజుతో తన భర్త కట్టుకున్న భార్యని కూడా చూడకుండా తనని తన స్నేహితులతో గడపమని చెప్పడం వంటివి తీవ్ర మనస్థాపానికి గురిచేసాయి. దీంతో మహిళ తన భర్త ఆగడాలను భరించలేక దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించి తన గోడు వెల్లబోసుకుంది. అయితే అడ్డుదారుల్లో డబ్బు సంపాదించాలని వివాహిత చేసిన పనికిగాను పోలీసులు ఆమెను అరెస్టు చేశారు అలాగే కట్టుకున్న భార్యని డబ్బు కోసం వ్యభిచారం చేయమని ప్రోత్సహించిన మరియు ఒత్తిడి తెచ్చిన భర్తను కూడా అదుపులోకి తీసుకొని కటకటాల్లోకి నెట్టారు.