Tollywood : టాలీవుడ్‌కి మెగా సహాయం అందించబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. గత ఏడాది నుంచి కరోనా బారిన కొన్ని లక్షల మంది పడుతున్న సంగతి తెలిసిందే. వారిలో కొందరు ప్రాణాలను కోల్పోయిన సందర్భాలున్నాయి కూడా. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీకి అన్నీ తానై చిత్ర పరిశ్రమలోని సినీ కార్మీకులందరినీ ఆదుకునేందుకు గత ఏడాది సిసిసి సంస్థను ఏర్పాటు చేసి విడతలవారిగా చిత్ర పరిశ్రమలోని వారందరు కలిసి కార్మీకులను ఆదుకున్నారు.

mega star is going to help tollywood-
mega star is going to help tollywood-

అయితే మరోసారి కరోనా సెకండ్ వేవ్ రూపంలో పంజా విసిరింది. ప్రపంచ వ్యాప్తంగా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ఊహించని స్థాయిలో ప్రతాప చూపిస్తోంది. ఇండస్ట్రీ ప్రముఖులే కరోనా బారి నుంచి తప్పించుకోలేకపోతున్నారంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి. ఇప్పుడు అందరిలో ఇదే ప్రశ్న వెంటాడుతోంది. ఇక సెకండ్ వేవ్ కారణంగా మళ్ళీ షూటింగ్స్ నిలిపి వేశారు. సినిమా రిలీజ్‌లు ఆగిపోయాయి. థియేటర్స్ కూడా మూత పడ్డాయి. దేశ వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ విధించారు.

Tollywood : మెగాస్టార్ తీసుకున్న ఈ మెగా నిర్ణయంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఇండస్ట్రీ పెద్దగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని సినీ కార్మీకులని, జర్నలిస్టులను కరోనా బారి నుంచి కాపాడేందుకు కరోనా క్రైసిస్ ఛారిటీ సిసిసి తరపున అపోలో సౌజన్యంతో అందరికీ వ్యాక్సినేషన్ అందివ్వబోతున్నారు. తాజాగా ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి అధికారకంగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. మెగాస్టార్ తీసుకున్న ఈ మెగా నిర్ణయంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on ఏప్రిల్ 20, 2021 at 7:39 సా.