Megastar Chiranjeevi : మెగాస్టార్ జనసేన పార్టీ కి సపోర్ట్ చేస్తున్నారా… ప్రూఫ్ ఇదిగో….

Joythi R

Megastar Chiranjeevi తెలుగు సినిమా చిత్ర పరిశ్రమలో మెగా బ్రదర్ నాగబాబు కి ఉన్నటువంటి క్రేజ్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే నటుడు నాగబాబు ఒకప్పుడు హీరోగా సినిమాల్లో నటించాడు. అలాగే పలు చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. కానీ దురదృష్టవశాత్తు నటుడు నాగబాబు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి సంపాదించినదానికంటే ఎక్కువగా పోగొట్టుకున్నాడు. అయితే ఇటీవల కాలంలో నటుడు నాగబాబు సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తన అభిమానులతో చిట్ చాట్ కార్యక్రమం వంటివి నిర్వహిస్తూ కొందరు అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇస్తున్నాడు.

అయితే తాజాగా నటుడు నాగబాబు తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా తన అభిమానులు అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. అయితే ఇందులో ఓ నెటిజన్ మెగాస్టార్ చిరంజీవి జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడా…? అని అని అడిగాడు. దీంతో మెగా బ్రదర్ నాగబాబు అవును అందులో ఎలాంటి సందేహం లేదని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు. అయితే అంతటితో ఆగకుండా కొందరు జనసేన పార్టీ సైనికులు వైకాపా పార్టీపై ఎద్దేవా వ్యాఖ్యలు చేసినప్పటికీ సమర్థించాడు. దీంతో ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Megastar Chiranjeevi : మెగాస్టార్ జనసేన పార్టీ కి సపోర్ట్ చేస్తున్నారా... ప్రూఫ్ ఇదిగో....
Megastar Chiranjeevi : మెగాస్టార్ జనసేన పార్టీ కి సపోర్ట్ చేస్తున్నారా… ప్రూఫ్ ఇదిగో….

మరికొందరైతే ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమా ఇండస్ట్రీ కోసం వైయస్ జగన్మోహన్ రెడ్డి తో సన్నిహితంగా మెలుగుతున్నాడని కానీ ఈ విషయాన్ని కొందరు అలుసుగా తీసుకొని తమ స్వప్రయోజనాల కోసం ఇలా ఇలా వాడుకుంటున్నారని అలాగే మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ కూడా వైకాపా పార్టీ వ్యతిరేకి కాదని చర్చించుకుంటున్నారు. అలాగే ఇప్పుడున్న ఇటువంటి పరిస్థితులలో మెగాస్టార్ చిరంజీవి ఏ పార్టీకి సపోర్ట్ చేస్తాడనే అంశం గురించి చర్చించడం మంచిది కాదని మరికొందరు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా మరో నెటిజన్ మీకు మీ తనయుడు వరుణ్ తేజ్ తో కలిసి నటించే అవకాశం వస్తే నటిస్తారా…? అని అడిగాడు. దీంతో నటుడు నాగబాబు ఈ విషయంపై స్పందిస్తూ నాకు కూడా వరుణ్ తేజ్ తో కలిసి నటించాలని ఉందని కానీ నా కొడుకు వరుణ్ తేజ్ అసలు ఒప్పుకోవడం లేదని సరదాగా రిప్లై ఇచ్చాడు.

- Advertisement -