Mehreen: ‘వాళ్ళకు కావాల్సినంత ఇస్తా’..మెహ్రీన్ కామెంట్స్ వైరల్..!

G K

Mehreen: టాలీవుడ్‌లో హిట్స్ అందుకుంటున్నా కూడా స్టార్ హీరోయిన్‌గా ఆశించిన స్టార్ హోదాను అందుకోలేకపోతోంది యంగ్ బ్యూటీ మెహ్రీన్ ఫిర్జాదా. నాని హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ హనురాఘవపూడి దర్శకత్వం వహించిన కృష్ణగాడి వీర ప్రేమగాధ సినిమాతో మెహ్రీన్ హీరోయిన్‌గా పరిచయమైంది. ఈ సినిమా సూపర్ హిట్ అందుకుంది. దాంతో టాలీవుడ్‌లో మేకర్స్ దృష్ఠి ఆమె మీద బాగానే పడింది. ఈ క్రమంలో వరుసగా అవకాశాలు అందుకుంటోంది. మధ్యలో కొన్ని ఫ్లాప్స్ వచ్చినా కూడా మెహ్రీన్ మళ్ళీ రాజా ది గ్రేట్ లాంటి హిట్ అందుకొని నిలదొక్కుకుంది.

మహానుభావుడు లాంటి యావరేజ్ హిట్స్ కూడా చాలాసార్లు మెహ్రీన్‌ను అవకాశాలు చేజారిపోకుండా కాపాడాయని చెప్పాలి. ఇక ఎఫ్ 2 సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మెహ్రీన్ ఈ మల్టీస్టారర్ సినిమాతో బాగానే క్రేజ్ తెచ్చుకుంది. దాంతో ఇప్పుడు ఎఫ్ 2 సీక్వెల్ సినిమా ఎఫ్ 3 మల్టీస్టారర్‌లో కూడా హీరోయిన్‌గా అవకాశం అందుకుంది. విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను మే 27న భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు.

mehreen-comments are going viral
mehreen-comments are going viral

Mehreen: అటు తమన్న తళుకులు మెహ్రీన్ మెరుపులు..

ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా హీరోయిన్ మెహ్రీన్ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఎఫ్ 3 సిరీస్‌లో హనీగా అందరినీ ఫస్ట్ పార్ట్ కంటే డబుల్ ఎంటర్‌టైన్ చేస్తానని తెలిపింది. ఎఫ్ 2లో కాస్త చైల్డిష్‌గా ఉంటుంది. కానీ, ఇప్పుడు ఎఫ్ 3లో మాత్రం మెహ్రీన్ పోషించిన హనీ పాత్రను చాలా మెచ్యూర్డ్‌గా డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు, ఫన్ అండ్ ఫ్రస్టేషన్‌తో కూడిన ఎంటర్‌టైన్మెంట్ ఆడియన్స్‌కు కావాల్సినంత ఇస్తానంటోంది. ఇక ఇందులో అటు తమన్న తళుకులు మెహ్రీన్ మెరుపులు కాస్త గ్లామర్ డోస్ ఎక్కువగానే ఉంటాయని అర్థమవుతోంది.

- Advertisement -