Mehreen : హీరోయిన్ మెహ్రీన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు.. నాచురల్ స్టార్ నాని కృష్ణ గాడి వీర ప్రేమ గాధ చిత్రంతో వెండి తెరకు హీరోయిన్ గా పరిచయమైన మెహ్రీన్.. ఆ తరువాత పలు బ్లాక్ బస్టర్ చిత్రాల్లో కూడా నటించింది.
టాలీవుడ్లో మెహ్రీన్ మీడియం రేంజ్ హీరోయిన్ గా కొనసాగుతుంది. అయితే ఈ బ్యూటీ కి యంగ్ హీరోల మూవీ ఆఫర్స్ మాత్రమే వస్తున్నాయట. అగ్రహీరోలతో నటించే అదృష్టం ఈ అమ్మడుకి దొరకడం లేదట. శర్వానంద్ హీరోగా నటించిన మహానుభావుడు చిత్రం అద్భుతంగా నటించి ప్రేక్షకులను అలరించింది.
అలాగే సాయి ధరమ్ తేజ్ తో జవాన్ చిత్రంలో బొద్దుగా కనిపించి కుర్రకారుల మనసుని దోచేసింది. అదేవిధంగా ఎఫ్ 2 చిత్రంలో వరుణ్ తేజ్ కి జోడిగా మెహ్రీన్ అద్భుతంగా నటించింది. గత ఏడాది యంగ్ హీరో సంతోష్ శోభన్ నటించిన మంచి రోజులొచ్చాయి చిత్రంలో కూడా ఈమె మెరిసింది.
ఈ ముద్దుగుమ్మ వెండితెరపై అందాలు ఆరబోయడానికి ఏలాంటి హద్దులు పెట్టుకోలేదు. బికినీలో కూడా నటించింది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. ఇటివలే మెహ్రీన్ తన కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్ లో ఎంజాయ్ చేసింది. దీంతో అప్పటి బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే తాజాగా ఉల్లిపొర లాంటి పలుచని ట్రెండీ వేర్ లో దిగిన ఫొటోలు అందరి దృష్టిని ఆకర్షించింది