YCP: వైసీపీ నాయకులకు ఇప్పుడు కొత్త భయం పట్టుకుంది, అదేంటంటే ఎమ్మెల్సీ ఎన్నికలు. ఈ పదం వింటేనే వైసీపీ నేతలకు వెన్నులో వణుకుపుడుతుంది. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ తగిలిన ఎదురుదెబ్బ అలాంటిది. ఎమ్మెల్సీ ఎన్నికల తరువాత క్రాస్ వోటింగ్ చేసిన నలుగురు ఎమ్మెల్యేలను వైసీపీ సస్పెండ్ చేసింది. ఆ నాయకులను పార్టీ సస్పెండ్ చేసిన తరువాత స్థానిక వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆ సస్పెండ్ అయిన నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ధర్నాలు చేస్తూ, ర్యాలీలు చేస్తూ, ఆ నేతలను బయటకు వస్తే చంపేస్తామని, నియోజకవర్గం నుండి వెళ్లిపోవాలని ఇలా అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. అయితే ఇలాంటి ఇబ్బందులకు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి భలే చెక్ పెట్టారు. ఉదయగిరి నియోజక వర్గం నుండి మేకపాటి వైసీపీ తరపున గెలిచారు. అయితే సస్పెండ్ ఐన తరువాత ఇప్పుడు అక్కడ ఉన్న వైసీపీ నేతలు మేకపాటికి నియోజకవర్గంలో తిరగనివ్వమని సవాల్ విసురుతూ, ర్యాలీలు చేశారు. అయితే వాటికి మేకపాటి ఇచ్చిన కౌంటర్ కు వైసీపీ నేతలు ఇజ్జత్ మొత్తం పోయింది.

బస్సు స్టాండ్ లో కూర్చొని సవాల్
బయటకు వస్తే కోరుతామని బెదిరించిన వైసీపీ వాళ్ళను సవాల్ చేస్తూ, మేకపాటి ఉదయగిరి బస్సు స్టాండ్ లో కూర్చొని, తనను కొట్టాలనుకున్నవాళ్ళు కానీ తనను అడ్డుకుంటామని చెప్పిన నేతలు కానీ ఇక్కడి రావాలని సవాల్ విసిరారు. దాదాపు గంటన్నర పాటు మేకపాటి అక్కడే ఉన్నారు కానీ ఒక్క వైసీపీ నాయకుడు అక్కడికి రాలేదు. సవాల్ చేసిన వైసీపీ నాయకులు మేకపాటి ధైర్యాన్ని, ఆయన వెనక ఉన్న జనాన్ని చూసి భయపడి బయటకు రాలేదని మేకపాటి అనుచరులు చెప్తున్నారు. అయితే తాము చేసిన ధర్నాకు భయపడి మేకపాటి బయటకు రాలేదని వైసీపీ నాయకులూ అనుకున్నారు కానీ ఇప్పుడు మేకపాటి బస్సు స్టాండ్ వచ్చి, అక్కడే కుర్చీ వేసుకొని కూర్చొని మరీ వైసీపీ వాళ్లకు షాక్ ఇచ్చారు. ఎవరు పడితే వాళ్ళు లీడర్స్ కాలేరని మేకపాటి వ్యాఖ్యానించారు.
వైసీపీకి ఇక చుక్కలే
మొన్నటి వరకు వైసీపీలో నేతలందరూ జగన్ కు చాల విధేయంగా ఉన్నారని, వచ్చే ఎన్నికల్లోనూ జగన్ తోనే ఉంటారని అంతా అనుకున్నారు కానీ ఒక్కసారి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రాగానే మొత్తం వైసీపీ ఫేట్ మారిపోయింది. వైసీపీ నాయకులు మునుపటిలా కాన్ఫిడెంట్ గా మాట్లాడలేకపోయారు. ఎందుకంటే ఈ సస్పెండ్ ఐన నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ నాయకులు చేస్తున్న తప్పుల గురించి , వైసీపీ చేస్తున్న తప్పుల గురించి ప్రజలకు చెప్తూ వైసీపీకి చుక్కలు చూపిస్తున్నారు. ఈనాయకులేమి గొప్ప నాయకులు కాదు నియోజకవర్గాలకు వీళ్ళు చేసిందేమి లేదు, వచ్చే ఎన్నికల్లో టీడీపీ కూడా వీళ్ళను పార్టీలోకి తీసుకుంటుందన్న నమ్మకం కూడా లేదు కానీ వైసీపీని గట్టిగ దెబ్బతిస్తున్నారు.