Rana daggubati : దగ్గుబాటి ఫ్యామిలీ టాల్ హీరో రానా దగ్గుబాటి పెళ్లి ఎంత ఆడంభరంగా గత ఏడాది కరోనా సమయంలో కూడా జరిగిందో మన అందరికి తెలిసిందే. వీఎఫెక్స్ వర్క్ చేస్తూ సినిమాలకి బ్యాక్ ఎండ్‌లో వర్క్ చేసిన రానా హీరో అవుతాడని ఎవరూ అనుకోలేదు. క్లాస్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల లీడర్ అనే టైటిల్ తో ఒక పొల్టికల్ బ్యాక్ డ్రాప్ కథను రెడీ చేసుకున్నారు. ఆ సినిమాను కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తో చేయాలనుకున్నారట. ఆయన ఆ సమయంలో శివాజీ సినిమా చేస్తున్న కారణంగా రెండేళ్ళు ఆగమని చెప్పారట. అలా అయితే ఏవిఎం బ్యానర్ లో ఈ సినిమా చేసుండేవారు. కానీ అంత సమయం శేఖర్ కమ్ముల ఆగలేకపోయారు.

mind-block-twist-is-given-by-rana-daggubati-regarding-his-marriage
mind-block-twist-is-given-by-rana-daggubati-regarding-his-marriage

ఆ తర్వాత ఇదే స్క్రిప్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయాలనుకున్నారు. కుదరలేదు. తర్వాత వెంకటేశ్ తో తీయాలనుకున్నారు. కథ విన్న వెంకటేశ్ – సురేష్ బాబు..రానా లాంఛింగ్ కి ఇది పర్‌ఫెక్ట్ స్టోరి అని భావించారు. అన్నీ ప్లాన్ చేసి లీడర్ సినిమాతో రానాను టాలీవుడ్ లో హీరోగా లాంచ్ చేశారు. మొదటి సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత బాలీవుడ్ సినిమాతో పాటు వరుసగా టాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్ట్ చేస్తూ వస్తున్నాడు. అయితే రానా పెళ్ళి గోవా బ్యూటీ ఇలియానాతో జరగబోతోందని అప్పట్లో బాగా ప్రచారం. రానా – ఇలియానా కలిసి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నేను నా రాక్షసి అనే సినిమా చేశారు.

Rana daggubati : రానా – త్రిష పేర్లు ప్రచారం చేశారు. వీరు పెళ్లి చేసుకుంటారని అనగానే అందరు నమ్మేశారు.

ఆ సమయంలో ఇద్దరు ప్రేమించుకున్నారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత తెరపైకి రానా – త్రిష పేర్లు ప్రచారం చేశారు. వీరు పెళ్లి చేసుకుంటారని అనగానే అందరు నమ్మేశారు. కానీ వాళ్ళ బ్రైన్ బద్దలయ్యేలా రానా షాకిస్తూ గత ఏడాది మిహీకా బజాజ్ ను పెళ్లి చేసుకోబోతున్నట్టు వెల్లడించాడు. గత కొన్నేళ్ళుగా ప్రేమలో ఉన్న వీరు పెళ్ళికి తన వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. అప్పటి నుంచి రానా – మిహీకాల పెళ్ళి వరకు చాలా హంగామా జరిగింది. అవన్నీ దగ్గుబాటి ఫ్యామిలీ ఏమాత్రం పట్టించుకోలేదు. చక్కగా ఇండస్ట్రీలోని ప్రముఖులను అత్యంత సన్నిహితులను ఆహ్వానించి ఎంతో వైభవంగా పెళ్ళి జరిపించారు. ప్రస్తుతం రానా నటించిన విరాట పర్వం రిలీజ్ కి రెడీ గా ఉంది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూలై 3, 2021 at 1:00 సా.